»   » లేటెస్ట్ గర్ల్‌ఫ్రెండ్‌కు సల్మాన్ ఖాన్ ఖరీదైన గిఫ్ట్.. ఏమిటది.. కొత్త ప్రియురాలు ఎవరు..

లేటెస్ట్ గర్ల్‌ఫ్రెండ్‌కు సల్మాన్ ఖాన్ ఖరీదైన గిఫ్ట్.. ఏమిటది.. కొత్త ప్రియురాలు ఎవరు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరో ప్రేమకథతో తాజాగా వార్తలకు ఎక్కాడు. రుమేనియాకు చెందిన ఇలియా వాంటర్‌తో సల్మాన్ అఫైర్ కొనసాగిస్తున్నాడనే వార్త గత ఏడాది నుంచి మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఆ మధ్యలో అఫైర్ బ్రేకప్ అయి వాంటర్ రుమేనియాకు వెళ్లిపోయినట్టు వార్తలు రావడంతో ఇక సల్మాన్ ప్రేమ కథ కంచికి చేరిందనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ తాజాగా తన మేనల్లుడు జన్మదిన వేడుకల కోసం సల్మాన్ కుటుంబంతో వాంటర్ కలిసి మాల్దీవులకు వెళ్లడంతో సల్మాన్ అఫైర్ డెయిలీ సీరియల్‌లా కొనసాగుతున్నదని స్పష్టమైంది.

జోరుగా వాంటర్, సల్మాన్ అఫైర్

జోరుగా వాంటర్, సల్మాన్ అఫైర్

ఇటీవల కాలంలో వాంటర్‌కు సల్మాన్ చేరువైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆమె అద్దె ఇంటికే పరిమితమైంది. గత నవంబర్‌ నుంచి ముంబైలో సల్మాన్ ఖాన్‌తో కలిసి ఉంటున్నది. ఇదిలా ఉండగా వీరిద్దరి అఫైర్ గురించి మరో వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. వాంటర్‌కు ముంబైలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి బహుకరించినట్టు సమాచారం.

గిఫ్ట్‌గా ఫ్లాట్ ఇచ్చిన..

గిఫ్ట్‌గా ఫ్లాట్ ఇచ్చిన..

కొద్దికాలంగా అద్దె ఇంటిలో ఉంటున్న వాంటర్ ప్రస్తుతం సల్మాన్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్లాట్‌లోకి వెళ్లినట్టు సమాచారం. అయితే ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నదనే విషయం చాలా గోప్యంగా ఉంచినట్టు తెలిసింది. అయితే సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు సమీపంలోనే వాంటర్ ఉంటున్నట్టు తెలిసింది.

టైగర్ జిందా హై..

టైగర్ జిందా హై..

ఇదిలా ఉండగా, మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి సల్మాన్ టైగర్ జిందా హై చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని అలీ అబ్బాస్ రూపొందిస్తున్నారు. సల్మాన్ నటించిన మరో చిత్రం ట్యూబ్‌లైట్ జూన్ 23 తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది.

హిమేశ్ రేష్మియాతో వాంటర్

హిమేశ్ రేష్మియాతో వాంటర్

సల్మాన్ ఖాన్ నిర్మించిన ‘ఓ తెరీ' చిత్రంలో పాట పాడి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సంగీత దర్శకుడు హిమేశ్ రెష్మియాతో కలిసి తాజాగా లతా మంగేష్కర్ పాడిన పాట లాగ్ జా గలే అనే పాటను పాటడం గమనార్హం. హిందీ భాష రాకపోయినప్పటికీ ఆమె పాడిన పాట సినీ అభిమానులు విశేషంగా ఆకట్టుకొన్నది. .

English summary
Bollywood superstar Salman Khan gifted flat to his girl friend Iulia Vantur. The report suggests that Iulia was earlier staying at a rented apartment, but now she has moved into an apartment which is owned by Salman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu