For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘గాడ్ ఫాదర్’లో మరో టాప్ హీరో: ఆయన కోసం గ్రీన్ సిగ్నల్.. మార్చడానికి చిరంజీవి రెడీ

  |

  ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లు ధీటుగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను మొదలు పెడుతూ సత్తా చాటుతున్నారాయన. ఇప్పటికే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. అది పూర్తి కాకముందే మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'లూసీఫర్' రీమేక్‌ను 'గాడ్ ఫాదర్' అనే టైటిల్‌తో మొదలు పెట్టేశారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమై వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

  Chiranjeevi lovely kiss to Pawan Kalyan: తమ్ముడిపై అంచంచలమైన ప్రేమను కురిపించిన మెగాస్టార్

  అక్కడ మోహన్ లాల్.. ఇక్కడ మెగాస్టార్

  అక్కడ మోహన్ లాల్.. ఇక్కడ మెగాస్టార్

  మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్‌లో.. మరో హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే ‘లూసీఫర్'. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విడుదలైంది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు.

  చిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

  తెలుగుకు అనుగుణంగా మార్చేసి అలా

  తెలుగుకు అనుగుణంగా మార్చేసి అలా

  ‘లూసీఫర్' మూవీ మలయాళంలో తెరకెక్కింది. తెలుగు రీమేక్ కోసం ఈ స్క్రిప్టును మొదట యంగ్ డైరెక్టర్ సుజిత్ తీసుకున్నాడు. కానీ, అనివార్య కారణాలతో అతడు తప్పుకున్నాడు. ఆ తర్వాత మోహన్ రాజా దీన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాడు. అలాగే, ఇందులో హీరోయిన్ పాత్రను కూడా జత చేశాడు. ఇక, ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్' అనే టైటిల్‌ను కూడా పెట్టేశారు.

  ఆ రెండు పాత్రలు చేసేది వాళ్లనని టాక్

  ఆ రెండు పాత్రలు చేసేది వాళ్లనని టాక్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్' మూవీలో నయనతార, సత్యదేవ్ పోషించే పాత్రల గురించి ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది దీని ప్రకారం.. మలయాళంలో మంజు వారియర్ పోషించిన హీరో సోదరి పాత్రను నయనతార చేస్తుందట. అలాగే, ఆమె భర్తగా నటించిన వివేక్ ఒబెరాయ్ రోల్‌ను టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  బిగ్ బేబీ బ్రదర్‌తో నిహారిక సందడి: సర్‌ప్రైజ్‌ చేసి సస్పెన్స్‌గా ఉంచి.. మెగా కిడ్‌ను గుర్తుపట్టారా!

  పృథ్వీ రాజ్ పాత్రలో సల్మాన్.. ఖాళీ లేక

  పృథ్వీ రాజ్ పాత్రలో సల్మాన్.. ఖాళీ లేక

  ‘గాడ్ ఫాదర్' మూవీలో హీరో పాత్రకు సహాయం చేసే ఓ డాన్ రోల్ కూడా ఉంటుంది. మలయాళంలో ఆ పాత్రను పృథ్వీ రాజ్ సుకుమారన్ చేశాడు. అయితే, తెలుగులో ఆ పాత్ర ఎవరు చేస్తారని చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను తీసుకున్నారని అన్నారు. ఆ వెంటనే ఆయన దీన్ని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

  ‘గాడ్ ఫాదర్' మూవీలో మరో టాప్ హీరో

  ‘గాడ్ ఫాదర్' మూవీలో మరో టాప్ హీరో

  పృథ్వీ రాజ్ సుకుమారన్ పోషించిన డాన్ పాత్రకు సల్మాన్ ఖాన్ ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోన్న సమయంలోనే మరో హీరో కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి ‘గాడ్ ఫాదర్' మూవీలో డాన్ పాత్రను సల్మాన్ ఖానే చేస్తున్నాడట. ఈ మేరకు అతడు రెండు రోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

  ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

  Allu Arjun వేరు.. మెగా హీరోలు వేరు - RGV | Pushpa Raj అందుకే మిస్ || Filmibeat Telugu
  అది కూడా ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరో

  అది కూడా ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరో

  తాజా సమాచారం ప్రకారం.. ‘గాడ్ ఫాదర్'లో నటించడం కోసం సల్మాన్ ఖాన్ ఒప్పుకోవడంతో పాటు వెంటనే డేట్స్ కూడా కేటాయించాడని తెలిసింది. అందుకు అనుగుణంగానే చిరంజీవి కూడా తన కాల్షీట్లను మార్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అవసరమైన ఈ మూవీ షెడ్యూల్‌ను ముంబైలో జరపడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Star Hero Megastar Chiranjeevi doing God Father Under Mohan Raja Direction. Now Bollywood Star Salman Khan has alloted dates for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X