For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగాఫ్యాన్స్ కు అదిరే న్యూస్.. పవర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్?

  |

  ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎక్కువగా హైదరాబాద్ లో కనిపిస్తున్నారు. పలు కారణాలతో ఆయన హైదరాబాద్ రావడమో, లేదా మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు ముంబై వెళ్లడం, ఆయనను కలిసి ఫోటోలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళ మాతృకలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య సన్నివేశాల షూటింగ్ కూడా ఈ మధ్యనే ముంబైలో పూర్తయింది. అయితే ఈ మధ్యకాలంలో హరీష్ శంకర్ ఒకటి రెండుసార్లు సల్మాన్ ఖాన్ తో భేటీ ఆయనతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సల్మాన్ ఖాన్ తో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాడేమో అని అందరూ భావించారు.

  Salman Khan in Pawan Kalyan’s Bhavadeeyudu Bhagat Singh

  కానీ ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది . అదేమిటి అంటే హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ తో ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం సల్మాన్ ఖాన్‌ను సంప్రదించగా ఆయన సినిమా చేసేందుకు అంగీకరించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వహించనున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆయన తాను హీరోగా నటిస్తున్న తన తదుపరి చిత్రం కభీ ఈద్ కభీ దీపావళి షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుత షెడ్యూల్ నెల రోజుల పాటు జరుగుతుంది. సల్మాన్ ఖాన్ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

  Recommended Video

  Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat

  బాలీవుడ్ లో కూడా కొన్ని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తున్నాడని అంటున్నారు. నిజానికి పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా మాదిరిగా చంపేస్తామంటూ సల్మాన్ కు బెదిరింపులు కూడా వచ్చాయి. తాజాహ వచ్చిన బెదిరింపులపై సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకు ఎవరిపైనా అనుమానాలు లేవని పోలీసులకు చెప్పారని సమాచారం. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదని స్టేట్మెంట్ ఇచ్చారని టాక్ బయటకు వచ్చింది. సిద్ధూను చంపినట్టు చెప్పుకుంటున్న కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ ఎవరో నాకు తెలీదన్నీ సల్మాన్ తన తండ్రి మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా బెదిరింపుల లేఖ వచ్చిందని చెప్పారు. సిద్ధూ కేసులో విచారిస్తున్న గ్యాంగ్‌ లీడర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గురించి తనకు తెలుసని, కృష్ణజింకను వేటాడిన కేసులో 2018లో అతని నుంచి తనకు చంపేస్తానన్న బెదిరింపులు వచ్చాయని తెలిపారు.

  English summary
  Salman Khan going to act in Pawan Kalyan’s Bhavadeeyudu Bhagat Singh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X