twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్, అర్పితా పెళ్లిలో?

    By Pratap
    |

    ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మీడియా ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతోంది. ఆయన వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ గురించి మీడియా కొత్త విషయాలు బయటపెడుతూనే ఉంటోంది. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ జాబితా నిజానికి చాలా పెద్దదే.

    తన తాజా గర్ల్ ఫ్రెండ్ యూలియా వంటూర్‌ను సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ పెళ్లిలో అందరికీ పరిచయం చేశాడట. తన సన్నిహిత మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆమెను పరిచయం చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముంబై మిర్రర్‌లో ఈ మేరకు ఓ వార్తాకథనం వచ్చింది.

     Salman Khan introduces new girlfriend Iulia Vantur to his family

    ఆ అందాల నటి అతుల్ అగ్నిహోత్రి సినిమా ఓ తేరీలో దర్శనమిచ్చింది. సల్మాన్ కాన్, యూలియా కలిసి తిరుగుతున్నారని, అయితే జాక్విలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలతో జోడించి సల్మాన్ ఖాన్‌పై పుకార్లు చేస్తున్నాయని, వాస్తవానికి యూలియాతో సల్మాన్ ప్రేమలో పడ్డాడని, యులియా సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో పూర్తిగా కలిసిపోయిందని అంటున్నారు.

    సల్మాన్ ఖాన్ రొమీనియన్ బ్యూటీ యులియాను కబీర్ ఖాన్ ఏక్ థా టైగర్ సినిమా షూటింగ్ సమయంలో డుబ్లిన్‌లో కలిశాడట. బాడీగార్డ్‌లో పెట్టుకోవడానికి ఓ రొమినీయన్ సాంగ్ హక్కుల పొందడానికి సల్మాన్ ఖాన్‌కు అప్పటి యూలియా బాయ్ ఫ్రెండ్ మారియూస్ మోగా సహాయం చేశాడట. యూలియా, మారియూస్ ఏడాది క్రితం విడిపోయారు.

    English summary
    Salman Khan introduced his latest girlfriend Iulia Vantur to his close friends and family at his sister Arpita’s wedding, according to a report in Mumbai Mirror.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X