విడిపోయిన ఆ స్టార్ జంట మళ్ళీ కలవబోతున్నారా...!
అప్పుడప్పుడూ చిలిపి తగాదాలు వున్నప్పటికీ, సల్మాన్ ఖాన్ తో స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నానని చెబుతోంది బాలీవుడ్ భామ కత్రినాకైఫ్. సల్మాన్ ఖాన్ తో స్నేహం కాస్తా ప్రేమాయణంగా మారి ఓ దశలో పెళ్లి వరకూ పరిస్థితులు దారి తీసినా, షడెన్ గా మేటర్ కట్ అయిపోయి, ఇప్పుడు సల్మాన్, కత్రినా ఎవరికి వారే అన్నట్టు వుంటోన్న సంగతి విదితమే.
'దబాంగ్" హిట్టయ్యాక సల్మాన్ ఖాన్ దశ మళ్ళీ తిరగడంతో, కత్రినా ఇప్పుడు సల్మాన్ ఖాన్ జపం చేస్తోంది. సల్మాన్ ఖాన్ తన జీవితంలో వెరీ వెరీ స్పెషల్ అనీ, పెళ్ళి చేసుకోవాలని తాను డిసైడ్ అయ్యేదాకా సల్మాన్ ఖాన్ పెళ్ళి చేసుకోకుండా వుంటే, అతన్ని తాను పెళ్ళాడతానని తాజాగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్.
సరదాగా అన్నదో, మరి సీరియస్ గానే అనేసిందోగానీ, ఈ మేటర్ సల్మాన్ ఖాన్ దాకా వెళితే, సల్మాన్ దాన్ని సీరియస్ గా తీసుకుంటే, ఆల్రెడీ వయసు దాటేసిన ఈ ఓల్డ్ బ్యాచిలర్ ఇంకో ఐదేళ్ళో, పదేళ్ళో పెళ్లి చేసుకోకుండానే టైమ్ పాస్ చేసేసినా చేసేస్తాడు.


Click it and Unblock the Notifications











