సల్మాన్, కత్రినా కలిసి ఐటం సాంగులో (ఫోటోలు)...!
ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ మరోసారి కలిసి పని చేయబోతున్నారు. ఓ ఐటం సాంగు చేయడానికి ఇద్దరూ కమిటైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రసీమ నుంచి అందిన సమాచారం ప్రకారం దర్శకుడు సావన్ కుమార్ తన తాజా సినిమాలో ఈ మాజీ లవర్స్‌తో ఐటం సాంగు చేయించాలనే ఆలోచనలో ఉన్నారట.
బాలీవుడ్ నుంచి అందిన రూమర్ల ప్రకారం...దర్శకుడు సావన్ కుమార్ 1983లో వచ్చిన 'Souten' మూవీకి సీక్వెల్‌గా రూపొందిస్తున్న చిత్రంలో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్‌లను ఐటం సాంగు చేయాల్సిందిగా కోరాడట. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కాలేదు.
ఓ ప్రముఖ పత్రిక వెల్లడించిన వివరాలు ప్రకారం 'సావన్ కుమార్ Souten 2 చిత్రాన్ని రూపొందించాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. అయితే చాలా మంది ఈ చిత్రానికి సీక్వెల్ తీయడం వల్ల పెద్దగా వర్కౌట్ కాదని అనుకుంటున్నారట. దర్శకుడు మాత్రం సీక్వెల్ మంచి ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడట. మరి సల్మాన్-కత్రినా ఐటం సాంగు ఆలోచన ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.

బాలీవుడ్లో అడుగు పెట్టి అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో కత్రినా కైఫ్ సల్మాన్‌ను కలిసింది. ఆమెకు సల్మాన్ ఆపన్నహస్తం అందించి టాప్ హీరోయిన్‌గా ఎదిగేలా సహకరించాడు సల్మాన్

ఏక్ థా టైగర్ చిత్రంలో సల్మాన్ ఖాన్, కత్రినా కలిసి నటించారు. కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ సోదరికి ప్రెండ్, అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కత్రినా సింప్లిసిటీ చూసి అప్పట్లో ఆమెను ప్రేమించాడట సల్మాన్

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రేమబంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. కొన్ని రోజుల పాటు ప్రేమపక్షుల్లా విహరించిన వీరు కొన్ని రోజులకే విడిపోయారు. ప్రస్తుతం కేవలం స్నేహితులుగా కొనసాగుతున్నారు.

సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ బాలీవుడ్ రొమాంటిక్ జంటగా పేరు తెచ్చుకున్నారు. సల్మాన్‌తో బ్రేకప్ తర్వాత సల్మాన్ మాట్లాడుతూ...‘తాము ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటామని వెల్లడించారు'

సల్మాన్ ఖాన్ గురించి ఆ మధ్య కత్రినా కైఫ్ మాట్లాడుతూ...‘సల్మాన్ ఖాన్ మనసు ఎంతో మంచిదని, అదే విధంగా అతను ఎంతో ధైర్య వంతుడు అని చెప్పుకొచ్చింది'.

కత్రినా కైఫ్ అందచందాల గురించి సల్మాన్ ఖాన్ స్వయంగా ప్రశంసించారు. ‘ఆమె అందం చూసిన ఎవరైనా సులభంగా ప్రేమలో పడతారని' వ్యాఖ్యానించారు.

కత్రినా కైఫ్ ఓసారి తన మనసులోని మాటను నిర్భయంగా బయట పెట్టింది. జీవితంలో తొలిసారిగా సల్మాన్ ఖాన్‌తో తన సీరియస్ రిలేషన్‌షిప్ ఏర్పడిందని వెల్లడించింది.

ఝలక్ ధిక్లా జా కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైప్ కలిసి సందడి చేసినప్పటి దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సూపర్ హిట్ మూవీ ఏక్ థా టైగర్ సెట్స్‌లో సల్మాన్, కత్రినా కలిసి నటించిన దృశ్యం.


Click it and Unblock the Notifications











