సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్.. పాత్రలో కీలక మార్పులు.. ఎలా ఉంటుందంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం జెట్ స్పీడ్ లో సినిమాలను ఫినిష్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఆరు పదుల వయసులో కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా పాతికేళ్ళ కుర్రాడి తరహాలో ఎనర్జీ గా కనిపిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ తో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మెగాస్టార్ చిరు, సల్మాన్ ఖాన్ చాలా వేగంగా ఒక షెడ్యూల్ ను ఫినిష్ చేసుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

వేగంగా ఫినిష్ అయ్యేలా..
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా చాలా వేగంగా ఫినిష్ అయ్యేలా వర్క్ చేస్తుంటారు. కేవలం సీరియల్ స్టార్ దర్శకులతో మాత్రమే కాకుండా నేటి తరం యువ దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. టాలెంట్ ఉన్నా డైరెక్టర్స్ ను పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఇక ఆచార్య సినిమా విడుదల కు సిద్ధంగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను కూడా ఫినిష్ చేసే పనిలో బిజీ అయ్యారు.

అసలు పాయింట్ తో మార్పులు
మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ ఆధారంగా రానుంది. ఒరిజినల్ సినిమా కథ లోని అసలు పాయింట్ ను తీసుకొని దర్శకుడు ఈ కథలో చాలా మార్పులు చేయడం జరిగింది. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మోహనకృష్ణ తెలియజేశాడు.

సల్మాన్ పాత్ర ఎలా ఉంటుందంటే..
లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ మేయిన్ హీరోగా నటించగా ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మోహన్ లాల్ పాత్రలో కనిపిస్తుండగా పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. హీరోకు సమస్య ఎదురైనప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చి హెల్ప్ చేస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాలో ఒరిజినల్ కంటే కాస్త ఎక్కువ స్థాయిలోనే ఆ పాత్రను హైలెట్ చేయనున్నట్లు సమాచారం.

హైదరాబాద్ లోనే సల్మాన్ ఖాన్
ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికీ రెండు కీలకమైన షెడ్యూల్స్ పూర్తిచేశారు. మరో ముఖ్యమైన షెడ్యూల్ ను జనవరి లాస్ట్ వీక్ లో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్టార్ట్ చేసే అవకాశం ఉందట. ఆ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ కోసమే సల్మాన్ ఖాన్ వారం రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది

రిలీజ్ ఎప్పుడంటే?
గ్యాప్ లేకుండా వీలైనంత త్వరగా వారం రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి ఆ షెడ్యూల్ ను ఫినిష్ చేయబోతున్నట్లు గా తెలుస్తోంది. దర్శకుడు మోహన్ క్రిష్ణ గాడ్ ఫాదర్ సినిమాను చాలా ఆసక్తిగా తెరకెక్కిస్తున్నట్లు టాక్ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా అతని పనితనం పై చాలా సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











