హైదరాబాద్‌లో లవర్‌తో దొరికిపోయిన సల్మాన్

ఆ వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం లులియా ఇండియాలోనే ఉంది. ప్రస్తుతం ఆమె సల్మాన్ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య వారు తరచూ కలిసి తిరుగుతడం చూసామని కొందరు చెబుతున్నారు కూడా. అయితే సల్మాన్ మాత్రం ఈ విషయాలేవీ బయట పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
సల్మాన్ ప్రేమాయణం గుట్టు రట్టు చేసేందుకు మీడియా వారు తమ తమ ప్రయాత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో సల్మాన్ దొరికి పోయాడు. తన తాజా సినిమా 'మెంటల్' సినిమా షూటింగులో భాగంగా హైదరాబాద్‌లోని రాజమోజీ ఫిల్మ్ సిటీకి ప్రయాణం అయ్యాడు సల్మాన్. ఆయన వెంట ఎవరున్నారో తెలుసా...? ఇంకెవరు లులియా వేంటర్. ఎయిర్ పోర్టులో మీడియా వారిని గమనించిన సల్మాన్ తన ప్రియురాలిని బాడీగార్డ్స్‌తో కలిసి హోటల్‌కి పంపించేసాడట.
సల్మాన్ వెళ్లేందుకు వేరే కార్ బుక్ చేసారు. అదే సమయంలో ఎయిర్ పోర్టులోనే ఉన్న ఓ రాజకీయ నాయకుడు సల్మాన్‌ను తన కార్లో రావాలంటూ ఆహ్వానించడంతో మీడియాకు దొరకకుండా తుర్రుమన్నాడట ఈ కండల వీరుడు. ఏది ఏమైతేనేం సల్మాన్ ప్రస్తుతం లులియా వేంటర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉండి డేటింగ్ చేస్తున్నట్లు బట్టబయలైంది.


Click it and Unblock the Notifications











