తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నపాత్రలో హిందిలో సల్మాన్ ఖాన్
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో పవన్ చేయబోయే పాత్రను హిందీలో సల్మాన్ ఖాన్ చేయనున్నట్లు సమాచారం.విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం పవన్ చేయబోయే పాత్ర సినిమా డైరక్టర్. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలిషెడ్యూల్ ఇజ్రాయెల్ లోని జెరూసలేంలో జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన అనూష్క కనిపిస్తోంది.ఇక తన పాత్ర కోసం పవన్‌కళ్యాణ్ ఎంతో శ్రద్ధ తీసుకుని, 50 రోజుల పాటు షూటింగులో పాల్గొంటారని కూడా సమాచారం. జె.కె.భారవి, సింగీతం శ్రీనివాసరావు, కొండా కృష్ణంరాజు గత రెండేళ్ల నుంచి ఈ చిత్ర కథను తయారుచేసారు. ఇక ఈ చిత్రంలో బాలలు ప్రధాన పాత్ర పోషిస్తారు.బాల రామాయణం,బాల భారతం తరహాలో ఇది బాలలతో రూపొందింస్తున్న క్త్రీస్తు చరిత్ర.


Click it and Unblock the Notifications











