For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiru153 టీమ్ కు షాకిచ్చిన సల్మాన్.. మరో స్టార్ హీరోతో సంప్రదింపులు?

  |

  మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.. తొలుత ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత తనకి చిరకాల కోరిక అయిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరంజీవి త్వరలోనే తన 153వ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా త్వరలో చిరంజీవి కూడా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ కి షాక్ ఇస్తూ సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఇప్పుడు యూనిట్ అంతా మరో హీరోను వెదికే పనిలో పడ్డారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  లూసిఫర్ రీమేక్

  లూసిఫర్ రీమేక్

  మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో చిరంజీవి రీమేక్ చేయడం కోసం రామ్ చరణ్ తేజ సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొన్నారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాగా నచ్చడంతో రామ్ చరణ్ ఈ సినిమా రీమేక్ హక్కులు కొనుగోలు చేయగా ఇప్పుడు నిర్మాత ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా చేస్తున్నారనే ప్రకటన రాక ముందే ముందు నుంచి ఈ సినిమా ఎవరు తెరకెక్కిస్తారు అనే అంశం మీద అనేక చర్చోపచర్చలు జరిగాయి.

  చివరికి ఆయన ఫైనల్

  చివరికి ఆయన ఫైనల్

  అందులో భాగంగానే ముందు సాహో తెరకెక్కించిన సుజిత్ రంగంలోకి దిగి కొన్నాళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఆ తర్వాత ఆయన తప్పుకోగా కొన్నాళ్ళ పాటు వి.వి.వినాయక్ ఈ స్క్రిప్ట్ పనులు చూసుకున్నారు. వినాయక్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తారని భావించగా అనూహ్యంగా ఆయన కూడా తప్పుకోవడంతో రంగంలోకి తమిళ దర్శకుడు మోహన్ రాజా దిగారు. గతంలో తెలుగులో హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలు చేసిన అనుభవం ఉన్న మోహన్ రాజా ఈ సినిమాకి కరెక్ట్ గా సూట్ అవుతుందని భావించి చిరంజీవి అలాగే ఈ సినిమా నిర్మాతలు ఆ బాధ్యతలు మోహన్ రాజాకు అప్పగించారు.

  సల్మాన్ ఖాన్ అనుకుంటే

  సల్మాన్ ఖాన్ అనుకుంటే

  అనుకున్నట్టుగానే చిరంజీవి మనసు మెప్పించే విధంగా ఈ స్క్రిప్ట్ ను ఆయన తీర్చిదిద్దినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లుగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని చిత్ర యూనిట్ సంప్రదించింది అని ప్రచారం జరిగింది.

  గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట

  గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట

  అయితే యూనిట్ కి తాను సినిమా చేస్తానని సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ ప్రచారం సారాంశం.. అయితే తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. నిజానికి ముందు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగడంతో సల్మాన్ ఒప్పుకోక తప్పలేదు అని అన్నారు. కానీ చిరంజీవి నేరుగా రంగంలోకి దిగి సల్మాన్ ని ఈ విషయం మీద ఎలాంటి సంప్రదింపులు జరిప లేదని కేవలం సినిమా యూనిట్ నుంచి ప్రతిపాదన వెళ్లగా దానికి ఈ సల్మాన్ ఒప్పుకోలేదని, సున్నితంగా ఆయన తిరస్కరించారు అని అంటున్నారు.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  విక్రమ్ కోసం రంగంలోకి

  విక్రమ్ కోసం రంగంలోకి

  ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సినిమా దర్శకనిర్మాతలు తమిళంలో స్టార్ హీరోగా ఉన్న విక్రమ్ ఈ పాత్ర చేయమని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కనుక ఒప్పుకుంటే ఈ సినిమాలో ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉంటాయి. నిజానికి ఈ పాత్రలో సత్యదేవ్ నటిస్తాడని కొన్ని రోజులు చరణ్ నటిస్తాడని కొన్ని రోజులు లేదు ఏకంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని కొన్ని రోజులు ఇలా ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. కానీ చివరికి ఎవరు ఈ పాత్రకి ఎవరూ ఫైనల్ కాకపోవడం ఆశ్చర్యకరంగా పెరిగింది. నిజానికి ఈ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగానే ఉన్నా సినిమా మొత్తం మీద గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. మరి ఈ పాత్ర ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.

  English summary
  As per the latest reports, Salman Khan rejects the chiranjeevi lucifer remake offer. Makers Now Approached Chiyaan Vikram for the Role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X