అలా అయితే సినిమా చేయనని మెగాస్టార్ కి షాకిచ్చిన సల్మాన్ ఖాన్.. అది కదా క్రేజ్ అంటే?
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. అక్కడ సల్మాన్ ఖాన్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నారు.. అయితే ఈ సినిమా చేసేందుకు గాను సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా రెండు తీసుకోను అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు రెమ్యునరేషన్ తీసుకోమని బలవంతపెడితే సినిమా చేయను అని కూడా ఆయన చెప్పేశారట. ఆ వివరాల్లోకి వెళితే

గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్
ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం అనే తమిళ సినిమాను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ గ్యాప్ లో ఆయన గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు.. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు

ఏమాత్రం ఆలోచించకుండా
ఈ సినిమాకు మోహన్ రాజ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తూ ఉండగా అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో ముందు సత్యదేవ్, రానా పేర్లు వినిపించాయి. కానీ చివరిగా సల్మాన్ ఖాన్ అయితే ఆ పాత్రకు సరిపోతుందని భావించి ఆయనను చిత్రబృందం సంప్రదించింది. చిన్ననాటి నుంచి మెగాస్టార్ అభిమాని కావడం హైదరాబాద్ మూలాలు ఉండడంతో సల్మాన్ ఖాన్ ఏమాత్రం ఆలోచించకుండా తను ఆ పాత్ర చేస్తానని ఒప్పుకున్నారు

బలవంతం చేస్తే
అయితే ఆ పాత్ర చేసినందుకు గానూ 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి గాడ్ ఫాదర్ నిర్మాతలు సిద్ధం అయ్యారు. కానీ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోనని ఒకవేళ తీసుకోవాలని బలవంతం చేస్తే తాను సినిమా చేయకుండా ఉండటానికి ఇష్టపడతా కానీ ఆయన చేసే సినిమాలో డబ్బులు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.

అభిమానుల ఆనందం
దీంతో మెగా స్టార్ రేంజ్ ఇది అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిజానికి RRR విడుదలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్ జరుగుతూ ఉండటంతో రాజమౌళి కూడా మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం దేశమంతా తెలిసే విధంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వ్యవహారం కూడా తెరమీదకు రావడంతో మెగాస్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వెన్నుపోటు పొడిచే పాత్ర
ఇక ఇదే సినిమాలో అనసూయ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతోంది అని అంటున్నారు. అది మెగాస్టార్ కు వెన్నుపోటు పొడిచే పాత్ర అని ప్రచారం జరుగుతోంది మలయాళం మాతృకలో అలాంటి పాత్ర ఒకటి ఉండగా అది సినిమాని మలుపు తిప్పే విధంగా ఉంటుంది. అనసూయ పాత్ర కూడా అదేనని ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక సినిమాను కొణిదెల సురేఖ సమర్పిస్తూ ఉండగా ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











