బాలీవుడ్ స్టార్ హీరోతో పూజా హెగ్డే రొమాన్స్? బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ
ప్రస్తుతం వెండితెరపై యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. టాలీవుడ్‌లో వరుసపెట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ మాంచి జోష్‌లో ఉంది ఈ ముద్దుగుమ్మ. కాగా తాజాగా ఈ భామకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం. ఇంతకీ ఆమెకు దక్కిన ఆ ఆఫర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

హీరోలకు బెటర్ ఛాయిస్.. పూజా గ్లామర్ కిక్
వరుణ్ తేజ్ సరసన నటించి 'ముకుంద' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇక్కడ వరుస సినిమా అవకాశాలు పట్టేసింది. తెలుగు దర్శకనిర్మాతలను బాగా అట్రాక్ట్ చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీ హీరోయిన్‌గా మారింది. యంగ్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతూ ప్రేక్షకులకు గ్లామర్ కిక్ ఇస్తోంది.

వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్.. వెరీ ఫాస్ట్ పూజా
డీజే సినిమాతో వచ్చిన బ్రేక్ పూజా కెరీర్‌కి పూలబాట వేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో, మహేష్ బాబుతో ‘మహర్షి'లో ఆడిపాడి అలరించింది పూజా. ఇక అల్లు అర్జున్ సరసన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ బుట్టబొట్ట.

బాలీవుడ్ బంపర్ ఆఫర్..
ఇక ఆమె జోష్ చూసిన బాలీవుడ్ దర్శకనిర్మాతలు పూజా హెగ్డేకు బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జోడీగా పూజా హెగ్డే ఎంపిక చేశారని తాజా సమాచారం. సల్మాన్ హీరోగా 'కభి ఈద్ కభి దివాళి' చిత్రం తెరకెక్కనుంది. సాజిద్ నడయాడ్వాలా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఫర్హాదా సంజీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇందులో పూజా అందాలకు పెద్దపీట వేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఓ వైపు అఖిల్.. మరోవైపు ప్రభాస్
తెలుగులో ప్రస్తుతం అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో పాటు ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న జాన్ మూవీ లోనూ పూజా హెగ్డే నటిస్తోంది.


Click it and Unblock the Notifications











