మెగాస్టార్ సినిమాకు ‘మెంటల్’ టైటిల్?
అయితే 'రాధె' టైటిల్ అంత క్యాచీగా లేదని, సల్మాన్ ఖాన్‌కు ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో క్యాచీగా ఉండే టైటిల్ పెట్టాలని నిర్మాతలు యోచిస్తున్నారట. ఇందుకోసం 'మెంటల్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు టైటిళ్లలో ఏ టైటిల్ ఫైనల్ అవుతుందో చూడాలి.
టైటిల్ సంగతి పక్కన పెడితే...ఈ చిత్రం 2013వ సంవత్సరం ఈద్ పండుగకు ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా సల్మాన్ సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఈ పండుగ సందర్భంగా విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రాలు బాక్సాఫీసును బద్ధలుకొట్టాయి. ఈద్ పండుగకు వచ్చిన చిత్రాల్లో 2009వ సంవత్సరంలో వచ్చిన 'వాంటెడ్', 2010లో విడుదలైన దబంగ్, 2011లో బాడీగార్డ్‌తో పాటు ఈ సంవత్సరం ప్రేక్షకులను అలరించిన 'ఏక్ థా టైగర్'లు భారీ విజయం సాధించాయి.
అందుకే రాబోయే సంవత్సరంలోనూ ఈద్‌కు వెండితెరపై రానున్న తన చిత్రం కూడా అంతే విషయం ఉన్నది కావాలన్నది సల్మాన్ అభిలాష. సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే ఈ స్టాలిన్ కథానాయకుడిగా బీయింగ్ హ్యూమన్ సంస్ధ ద్వారా పలు రకాల సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న సల్మాన్ అయితేనే బాగుంటుందన్నది కూడా పలువురి అభిప్రాయం.


Click it and Unblock the Notifications












