twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' పై ముంబైకి సీక్రెట్ రిపోర్ట్స్

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు తెలుగులో ఎంత హైప్ క్రియేట్ చేస్తోందో అంతకు మించి హిందీలోనూ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సౌత్ సినిమాలు వైపు చూస్తున్న బాలీవుడ్ దృష్టి మొత్తం దూకుడు మీదే ఉంది.వారు ఎప్పటికప్పుడు ఈ చిత్రం రిపోర్ట్స్ విశేషాలు సీక్రెట్ గా తెలుసుకుంటున్నారు. అందులోనూ దూకుడు చిత్రం పోలీస్ స్టోరీ కావటం సల్మాన్ ఖాన్ కి చాలా ఆసక్తి ఉందని తెలుస్తోంది. మహేష్ గతంలో చేసిన పోకిరి రీమేక్ తో హిట్ కొట్టి ఉండటంతో ఈ సినిమా వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మరో ప్రక్క కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్లు చిత్రం రెడీ కూడా హిందీలో బాగా ఆడటం కూడా ఈ సినిమాను హాట్ గా మారుస్తోంది. అలాగే నీ దూకుడు...సాటెవ్వడు అంటూ అదిరిపోయే లెవెల్లో ఆడియో ఫంక్షన్‌ చేసిన నిర్మాతలు అంతకన్నా ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

    తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.

    English summary
    After picking Ready and Bodyguard in return for Dabangg, now salman khans camp members are securing the secret reports on the final out put of Dookudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X