క్రతినా బర్త్‌డేకు సల్మాన్ అదిరిపోయే గిఫ్ట్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తను ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయగల విశాలమైన మనసుకలవాడనే పేరుంది. తాజాగా సల్మాన్ ఖాన్ తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ బర్త్ డే సందర్భంగా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఖరీదైన ఆడి కార్‌ను ప్రజెంట్ చేశాడు.
ఈ నెల 16వ తేదీన ఉదయం కత్రినా యష్ రాజ్ స్టూడియోస్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. తన రాబోయే చిత్రం ఎక్ థా టైగర్ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాల కోసం ఇక్కడకు వచ్చి ఆమెతో యూనిట్ సభ్యులు కేక్ కట్ చేయించారు. అదే రోజు సాయంత్రం కత్రినా ముంబైలోని సల్మాన్ నివాసంలో అతని ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి పార్టీ ఎంజాయ్ చేసింది.
బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి....ఇటీవల మృతి చెందిన రాజేష్ ఖన్నా అంత్యక్రియలకు కత్రినా అదే కారులో వచ్చిందని, అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం అదేకారులో వెళ్లిందని తెలుస్తోంది. కత్రినా అందుకున్న గిఫ్టును చూసి సల్మాన్ లాంటి స్నేహితుడు ఆమెకు దొరకడం ఎంతో అదృష్టం అని కుళ్లుకుంటున్నారట.
2008 సంవత్సరంలో విడుదలైన 'యువరాజ్' చిత్రంలో సల్మాన్, కత్రినాలు కలిసి నటించారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న 'ఏక్ థా టైగర్' చిత్రం ఆగస్టు 15 తేదిన విడుదలకు సిద్ధమౌతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఈచిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మించారు.


Click it and Unblock the Notifications











