వెంకటేష్ మూవీలో పాన్ ఇండియా హీరో.. బాలయ్య వల్లే అనిల్ రావిపూడి ఇలా!
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. చాలా కాలంగా క్లీన్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్న ఈ బడా హీరో.. ఈ మధ్య కాస్త స్లో అయ్యారు. ఇలా చాలా గ్యాప్ తర్వాత దగ్గుబాటి వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి 'సైంధవ్' అనే సినిమాతో వచ్చారు.
'సైంధవ్' సినిమా ఆశించిన రీతిలో ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో విక్టరీ వెంకటేష్ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. రెండు క్రేజీ చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ కావడంతో దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించబోయే సినిమాకు ఇటీవలే అధికారికంగా మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి రెగ్యూలర్ షూటింగ్‌ను సైతం ఎంతో వేగంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును సైతం కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తోన్న ఈ చిత్రం పోలీస్ అధికారి స్టోరీతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇందులో హీరో మాజీ ప్రేయసి, భార్య మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని అంటున్నారు. అలాగే, ఇందులో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లను కూడా పెడుతున్నారు. తాజాగా దీనిపై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నట్లు తాజాగా తెలిసింది. ఓ కీలకమైన ఎపిసోడ్‌లో అతడి స్పెషల్ ఎంట్రీ ఇస్తాడట. అప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ కామియో కోసం అనిల్ రావిపూడి మొదట బాలయ్యను సంప్రదించాడట. కానీ, ఆయన అనివార్య కారణాల వల్ల దీన్ని చేయలేకపోతున్నారని, అందుకే సల్మాన్ ఖాన్‌తో చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా.. దగ్గుబాటి వెంకటేష్ - అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











