SVC 63: సల్మాన్‌ ఖాన్‌ను ఢీకొట్టే విలన్ ఎవరు? వంశీ,దిల్ రాజు స్కెచ్ ఎంటీ?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్​లో భారీ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్: SVC63) పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబడుతోంది. ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ముంబైలో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో కథానాయిక నయనతార పాల్గొనడం ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే.. తాజాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టే విలన్ ఎవరు? అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరి సమానంగా నిలిచే పవర్ ఫుల్ విలన్ కోసం మేకర్స్ ప్రత్యేకంగా శోధిస్తున్నారు. ఈ మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా సీనియర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నటనలో వైవిధ్యాన్ని చూపగలిగేలా ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా, సల్మాన్‌తో స్క్రీన్‌పై బలమైన పోటీ ఇవ్వగలరనే నమ్మకంతో చిత్రబృందం ఆలోచనలో ఉంది.

Salman Khan Vamshi Paidipally Film Villain Race Fahadh Faasil vs Akshaye Khanna Buzz

ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేయడం విశేషం. దీనితో కథలో పాత్రల బలం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది. వంశీ పైడిపల్లి తన సినిమాల్లో పాత్రలను బలంగా నిర్మించే దర్శకుడిగా పేరుంది. అందుకే ఈసారి కూడా హీరోతో పాటు విలన్ క్యారెక్టర్‌కు సమానమైన అవకాశాన్ని ఇవ్వడానికి ఆయన ప్లాన్ చేయగల సమాచారం.

వంశీ పైడిపల్లి గత చిత్రాలను దృష్టిలో ఉంచుకుని, 'ఎవడు', 'ఊపిరి', 'మహర్షి', 'వారసుడు' వంటి సినిమాల్లో భావోద్వేగం, కమర్షియల్ ఎలిమెంట్స్ మధ్య మంచి లెన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా 'మహర్షి'కి జాతీయ అవార్డు రావడం ఆయన కథన శైలికి ఉన్న బలం. ఇప్పుడు అదే స్ట్రాటజీని బాలీవుడ్‌లో కూడా అమలు చేస్తోంది, సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లుగా ఉంది.

ఇక నిర్మాత దిల్ రాజు విషయానికి వస్తే, ఇది ఆయన నిర్మాణం 63వ సినిమా. తెలుగులో అగ్ర నిర్మాతగా నిలిచిన ఆయన, హిందీలో కొన్ని రీమేక్‌లు చేసినప్పటికీ, నేరుగా సల్మాన్ ఖాన్ స్టార్‌తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించడమే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట.

ఈ భారీ బడ్జెట్ మూవీని 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కు ఈద్ సీజన్ ఎప్పుడూ లక్కీగా నిలిచిన విషయం తెలిసిందే. 'సుల్తాన్', 'బజరంగీ భాయిజాన్' వంటి సినిమాలు ఈ సమయంలోనే భారీ విజయాలు సాధించాయి. అయితే ఇటీవల 'టైగర్ 3', 'సికందర్' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్ట, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పైనే సల్మాన్ అభిమానుల ఆశలు నిలిచాయి.

ఇలా వంశీ పైడిపల్లి చాలా స్ట్రాటజిగా ఈ సినిమా ప్లాన్ స్పష్టంగా కనిపించింది. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్, నయనతార గ్లామర్, స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్, దిల్ రాజు భారీ నిర్మాణ విలువలు అన్నీ కలిస్తే ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విలన్ ఎంపిక ఫైనల్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరగడం ఖాయం అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X