పెళ్లి చేసుకోబోతున్న సల్మాన్ ఖాన్?
వయసు యాభై ఏళ్లకు చేరువవుతున్నా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్న సంగతి తెలిసిందే. తను ఎంతగానో ప్రేమించిన ఐశ్వర్యరాయ్ తనను కాదనడమే కాకుండా, పిచ్చోడిగా ముద్ర వేసిందనే బాధతో సల్లూ భాయ్ చాలా కాలం స్ట్రగుల్ అయ్యాడు. ఆ తర్వాత కత్రినా కైఫ్, మరికొందరు అందగత్తెలతో సల్లూ భాయ్ ఎఫైర్లు నడిపారు.
సల్మాన్ దుసురు స్వభావం వలనే అన్ని బెడిసి కొట్టాయనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఎఫైర్లకు దూరంగా ఉంటున్న సల్మాన్ మెల్లిమెల్లిగా వరుస హిట్లతో టాప్ హీరో పొజిషన్‌కి వెళ్లాడు. ఇప్పటి వరకు పెళ్లి జోలికి పోని ఈ హీరో....త్వరలో ఓ ఇంటి వాడవుతున్నట్లు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం సల్లూభాయ్‌కి ఇంట్లో వాళ్లు సంబంధాలు చూసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా వాళ్లను కాకుండా మంచి కుటుంబం నుంచి సల్మాన్‌కి పిల్లను వెతికే ప్రయత్నంలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ..... జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండాలనే ఆలోచన లేదని సమాధానం ఇచ్చారు. నన్ను ప్రేమించే అమ్మాయిలు ఉన్నారనే క్లూ కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరమే ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సంవత్సరం జెనీలియా-రితేష్ పెళ్లి చేసుకున్నారు. కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ పెళ్లి కూడా ఇదే సంవత్సరం జరుగబోతోంది. ఇదే ఏడాది సల్మాన్ పెళ్లి కూడా జరిగితే ఎక్కువ మంది బాలీవుడ్ స్టార్స్ పెళ్లి చేసుకున్న సంవత్సరంగా 2012 చరిత్రలో నిలిచి పోతుంది.


Click it and Unblock the Notifications











