»   » యువతిపై సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ దాడి?

యువతిపై సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ దాడి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ బాడీగార్డ్ ఓ యువతిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని, సదరు యువతి తన తల్లితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సల్మాన్ ఖాన్ బాడీగార్డుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

బాంధ్రా పోలీస్ స్టేషన్ బయట సదరు యువతి, ఆమె తల్లి హంగామా సృష్టించారని, సల్మాన్ ఖాన్ టెర్రరిస్ట్ ఆరోపణలు చేస్తూ డ్రామా క్రియేట్ చేసారని, ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ బాడీగార్డు వారిపై చేయి చేసుకున్నట్లు చర్చించుకుంటున్నారు. పబ్లిసిటీ కోసమే సదరు యువతి ఇలా చేసిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు వివాదాలు, కోర్టు కేసులతో సతమతం అవ్వడం సల్మాన్ ఖాన్‌కు సాధారణం అయిపోయింది. గతంలో సల్మాన్ ఖాన్‌పై వివిధ కేసులో నమోదయ్యాయి. తాజాగా అతనిపై యాక్సిడెంట్ కేసు కోర్టు విచారణలో ఉంది. ఈ కేసు రుజువైతే సల్మాన్‌కు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.

సెప్టెంబరు 28, 2002న సల్మాన్‌ మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ మోతాదుకు మించి మందు కొట్టినట్లు తేలింది. అతడి రక్త నమూనాలో 60 మిల్లీగ్రాముల ఆల్కహాల్‌ ఉన్నట్లు అప్పట్లో కోర్టుకు నివేదిక కూడా సమర్పించారు.

English summary
Bollywood superstar Salman Khan has reportedly been trapped in a fresh controversy, after a young woman accused the actor's bodyguard of beating her up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu