ఐటం సాంగ్‌పై తెగ ఇదై పోతున్న తెలుగమ్మాయి
చాలా రోజుల క్రితమే పరిశ్రమలోకి అడుగు పెట్టినా...రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరో వచ్చిన మర్యాద రామన్న చిత్రం ద్వారా మాత్రమే పాపులర్ ఫిగర్ అయింది హీరోయిన్ సలోని. ఆ తర్వాత తెలుగమ్మాయి చిత్రంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ పాపం సలోనికి అదృష్టం కలిసి రావడం లేదు, అవకాశాలు తగ్గి పోయాయి.
దీంతో ఇటీవల విక్రమ్ హీరోగా వచ్చిన 'వీడింతే' చిత్రంలో ఐటం సాంగుకు ఓకే చేసిందీ భామ. ఈ సాంగు ద్వారా తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశించిందో? లేక అవకాశాలు లేక ఒప్పుకుందో తెలియదుకానీ.....అమ్మడు ఆలోచనలు తలక్రిందులు అయింది. ఈ పాటలో సలోనికి పెద్దగా మార్కులు పడలేదని చెప్పాలి. పైగా పరిశ్రమలో మరో నమిత తయారవుతుందనే కామెంట్లు కూడా వినిపించాయి. గతంలో కంటే ఈ సినిమాలో సలోని లావెక్కి కనిపించడం కూడా ఇలాంటి కామెంట్లుకు ఓ కారణం కావొచ్చు. ఈ వార్తలతో చాలా డిస్సప్పాయింట్ అయిన సలోని ఇకపై ఐటం సాంగులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సలోని రెండు పెద్ద సినిమాల్లో నటించింది. వెంకటేష్ బాడీగార్డ్ సినిమాతో పాటు, బాలయ్య అధినాయకుడు చిత్రంలో సలోని సహాయ నటిగా కనిపించనుంది. ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్న సలోని....కెరీర్ గాడిలో పడేదెప్పేడో ఇప్పటికిప్పుడు చెప్పడం కాస్త కష్టమే.


Click it and Unblock the Notifications











