సలోనికి మొత్తానికి పెద్ద హీరో సరసన ఆఫర్ వచ్చింది
మర్యాద రామన్న చిత్రంలో తెలుగు అమ్మాయి గా మురిపించిన సలోనికి ఆ తర్వాత తెలుగు అమ్మాయి అనే చిత్రంలో తప్ప ఆఫర్స్ ఏమీ రాలేదు.ఆ నిరాశలో ఉండగానే ఆమెకు వెంకటేష్ సరసన అవకాశం వచ్చింది.వెంకటేష్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న బాడీగార్డ్ రీమేక్ లో సలోని సెకెండ్ హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం.మొయిన్ హారోయిన్ త్రిషకు స్నేహితురాలిగా ఉంటూ కథను కీలకమలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించనుందని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలై ఓ షెడ్యూల్ పూర్తయ్యింది.ఇక సలోని..రీసెంట్ బాలకృష్ణ సరసన మహదేవ నాయుడు చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











