Samantha: న్యూడ్ సీన్స్‌కు ఓకే చెప్పిన సమంత? ఆ హీరోతో రొమాంటిక్‌గా!
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది బ్యూటిఫుల్ సమంత. మొదట్లో గ్లామర్ పాత్రలు చేసి అదరగొట్టిన సమంత ఇటీవల కాలంలో మాత్రం ఎక్కువగా హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. అందుకు ఉదాహరణలే గతేడాది వచ్చిన యశోద.. ఈ సంవత్సరం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న శాకుంతలం. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీసులో బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటిగా అదరగొట్టింది. ఇప్పుడు అంతకుమించిన రేంజ్ లో హాట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి సమంత ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.
అన్నిటికి మించి: ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్పలోని ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఫిట్ నెస్ బ్యూటి సమంత అతి త్వరలో శాకుంతలం అనే లేడీ ఒరియెంటెడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్నిటికి మించి ఇందులో సమంత దేవకన్యను మైమరిపించేలా ఉందని ప్రశంసలు దక్కాయి.

అల్లు అర్హ ఎంట్రీ: ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియాగా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.

శరవేగంగా షూటింగ్: స్టన్నింగ్ బ్యూటి సమంత శాకుంతలం సినిమా కాకుండా మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఖుషీ అనే సినిమా చేస్తోంది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ప్రేమాయణం సాగించనుంది బ్యూటిఫుల్ సామ్. మజిలి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
అతనితో కలిసి: సమంత సిటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీసులోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ యాక్టర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో హై ఓల్టేజ్ యాక్షన్స్ సీక్వెన్స్ తో పాటు ఘాటు బెడ్ రూమ్ సన్నివేశాల్లో అదరగొట్టింది ప్రియాంక చోప్రా. రిచర్డ్ మ్యాడెన్ తో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్ అలరించేలా ఉన్నాయి.

అంగీకారం తెలిపినట్లు: అయితే ఈ హాలీవుడ్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ గా వస్తున్న వెబ్ సిరీసులో సమంత నటిస్తున్న ప్రకటన రావడంతో హాట్ సన్నివేశాలపై చర్చ జరుగుతోంది. ప్రియాంక చోప్రా తరహాలో బోల్డ్ గా సమంత నటించనుందా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే తాజాగా అలాంటి సెమీ న్యూడ్ సన్నివేశాల్లో నటించేందుకు సమంత అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గ్రాఫిక్స్ ఉపయోగించి: సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సమంత ఘాటు బెడ్ రూమ్ సన్నివేశాల్లో హాట్ గా పర్ఫామ్ చేయనుందన్న న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ సన్నివేశాలను గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కూడా ఉందని చర్చిస్తున్నారు. సమంత వెర్షన్ సిటాడెల్ ట్రైలర్ లేక టీజర్ విడుదలైతే గానీ ఈ వార్తల్లో ఎంత నిజముందో చెప్పలేం.


Click it and Unblock the Notifications











