షాకింగ్: వినాయక్ దర్శకత్వంలో చిన్న హీరోతో సమంత?

By Bojja Kumar

హైదరాబాద్: సమంత ఆ మధ్య ‘అల్లుడు శ్రీను' చిత్రంలో కొత్త హీరో బెల్లకొండ శ్రీనివాస్ సరసన నటించి అందరినీ ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించడం, బెల్లంకొండ సురేష్ కొడుకు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కావడంతో భారీగా రెమ్యూనరేషన్ తీసుకుని కొత్త హీరో అయినా ఓకే చెప్పేసింది.

సమంత మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి కూడా వివి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఉందంటున్నారు. సందీప్ కిషన్ అంకుల్ చోటా కె.నాయుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో ఉందని, త్వరలో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Samantha accepting Sundeep Kishan film?

సమంత తాజా సినిమాల విషయానికొస్తే...ఆమె నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఆమె విక్రమ్ సరసన నటించిన తమిళ మూవీ '10 ఎన్రాదుకుల్ల' చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

సినిమాలో తన పాత్ర గురించి సమంత మాట్లాడుతూ... తాను నటిస్తున్న '10 ఎన్రాదుకుల్ల' కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తన పాత్ర భిన్న పార్శాలో సాగుతుందని, సర్వశక్తులుఒడ్టి సినిమాకోసం శ్రమిస్తున్నానని చెప్పింది సమంతా. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో దాదాపు యాభైకోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే నెలలో విడుదలకానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X