నాగ్ రొమాన్స్, లిప్ లాక్‌లకు సమంతనే కారణం.. బయటికొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్

సీనియర్ హీరోనే అయినా అందంలో జూనియర్లతో పోటీ పడుతున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున. ఐదు పదుల వయసులో కూడా ఏమాత్రం తరగని అందంతో దర్శనమిస్తున్న నాగ్.. తాజాగా నటించిన చిత్రం 'మన్మథుడు 2'. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

వివాదాలతో పయనం

వివాదాలతో పయనం

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. అన్నింటికీ కారణం మాత్రం ఈ సినిమాలో నాగార్జున చేసిన రొమాన్స్, అలాగే లిప్ లాక్‌లు. వీటికితోడు, చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య, ప్రముఖ సింగర్ చిన్మయిని ఎంటర్ చేస్తూ విమర్శలు చేస్తుండడంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై చిత్ర యూనిట్ మాత్రం లైట్‌గానే తీసుకుంటోంది.

లిప్ లాక్‌లకు ప్రాక్టీస్ అయింది

లిప్ లాక్‌లకు ప్రాక్టీస్ అయింది

ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లిప్ లాక్స్ గురించి ఓ మీడియా ప్రతినిధి అడగ్గా... ‘‘మీరు గీతాంజలి సినిమా చూశారా? అందులో రెండున్నర నిమిషాలు లిప్ లాక్ సీన్ చేశాను'' అని సమాధానం ఇచ్చారు నాగ్. అప్పటికీ ఇప్పటికీ మీ ఏజ్ చాలా మారింది కదా అంటే... ‘‘ఇపుడు ప్రాక్టీస్ కూడా బాగా అయింది'' అంటూ పంచ్ వేశాడు నాగ్.

సమంత కీలక పాత్ర

సమంత కీలక పాత్ర

‘మన్మథుడు 2'లో అక్కినేని వారి కోడలు సమంత కీలక పాత్ర చేస్తుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించగా, నాగ్ మాత్రం ఈ మధ్య స్పష్టం చేశారు. అంతేకాదు, తామిద్దరి కాంబినేషన్‌లో ‘మనం', ‘రాజుగారి గది 2' తర్వాత వస్తున్న మూడో చిత్రమని ఆయన వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంతను జాగ్రత్తగా చూసుకున్నానని వెల్లడించాడు.

 కథ మలుపు తిప్పుతుందట

కథ మలుపు తిప్పుతుందట

వయసు దాటిపోయాక పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తికి.. ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి..? దీంతో అతడు ఏ విధంగా మారాడు..? అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి చేసుకోడానికి ఇష్ట పడని నాగార్జునకు సమంత సాయం చేస్తుందట. అప్పటి నుంచి అతడిలో మార్పులు వస్తాయట. దీంతో సినిమా కథ మలుపు తిరుగుతుందని ఓ వార్త బయటకు వచ్చింది. సామ్ చెప్పిన తర్వాతనే నాగ్.. ‘మన్మథుడి'లా మారిపోతాడని టాక్.

 ‘మన్మథుడు 2' గురించి

‘మన్మథుడు 2' గురించి

టాలీవుడ్ అందగాడు నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్లు, ఇటీవల వచ్చిన ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X