For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత - నాగ చైతన్యకు మళ్లీ పెళ్లి: నాగార్జున సూపర్ ప్లాన్.. వారసుడిగా మారేందుకే ఇలా!

  |

  చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని వారి అబ్బాయి నాగ చైతన్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వివాహానికి ముందు ఏ విధంగానైతే సినిమాలు చేశారో.. ఆ తర్వాత కూడా వీళ్లు తమ తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. దీంతో నాలుగు చేతులా సంపాదిస్తూ కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరితో అక్కినేని నాగార్జున అదిరిపోయే ప్లాన్ వేశాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి చేశారు

  పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి చేశారు

  సమంత.. నాగ చైతన్య కలిసి ‘ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడు ఆడిషన్స్ కోసం ఆమె ఫొటోను తొలిసారి చూశాడట. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ‘మనం' సినిమా సమయంలో నాగార్జునకు ఈ విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు.

  వివాహం తర్వాత హిట్ కొట్టిన జంట

  వివాహం తర్వాత హిట్ కొట్టిన జంట

  వివాహం తర్వాత కూడా అక్కినేని నాగ చైతన్య - సమంత కలిసి నటించారు. ఆ చిత్రమే ‘మజిలీ'. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఈ సినిమా ముందు వరకూ వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు చైతూ. ఇందులో సమంతతో కలిసి నటించి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కేశాడీ హీరో.

  ఎవరి సినిమాలతో వాళ్లు ఫుల్ బిజీ

  ఎవరి సినిమాలతో వాళ్లు ఫుల్ బిజీ

  ప్రస్తుతం ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత గుణ శేఖర్ తెరకెక్కించే ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ చేయనుంది. ఇక, నాగ చైతన్య మాత్రం ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ'లో నటించాడు. ఇప్పుడు విక్రమ్ తెరకెక్కించే ‘థ్యాంక్యూ'తో పాటు ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా'లో నటిస్తున్నాడు.

  నాగార్జున కూడా వరుస సినిమాలు

  నాగార్జున కూడా వరుస సినిమాలు

  అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత, నాగ చైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నట్లే.. కింగ్ నాగార్జున కూడా స్పీడుగా వెళ్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ‘వైల్డ్ డాగ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఆ వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి పూజా కూడా చేసేశాడు. అలాగే, తన డ్రీమ్ ప్రాజెక్టు ‘బంగార్రాజు'ను సైతం పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.

  ఆ మూవీకి ముందు జరిగిన కథతో

  ఆ మూవీకి ముందు జరిగిన కథతో

  అక్కినేని నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన'. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్ తీయాలని నాగ్, కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే ‘బంగార్రాజు' అనే ప్రాజెక్టుపై వర్క్ మొదలు పెట్టారు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తోంది.

  సూపర్ ప్లాన్ రెడీ చేసిన నాగార్జున

  సూపర్ ప్లాన్ రెడీ చేసిన నాగార్జున

  ‘బంగార్రాజు' ప్రాజెక్టు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే దీని గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక, ఎప్పటి నుంచే వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడట. అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో సమంత కూడా కీలక పాత్ర చేస్తున్నట్లు తెలిసింది.

  Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
  సమంత - నాగ చైతన్యకు మళ్లీ పెళ్లి

  సమంత - నాగ చైతన్యకు మళ్లీ పెళ్లి

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘బంగార్రాజు'లో సమంత - నాగ చైతన్య భార్య భర్తల్లా కనిపించబోతున్నారట. వాళ్లకు పుట్టిన అబ్బాయే బంగార్రాజు (నాగార్జున) అవుతాడని తెలిసింది. వీళ్లిద్దరూ సినిమా ఆరంభంలోనే దాదాపు 20 నిమిషాల పాటు కనిపిస్తారని తెలిసింది. గతంలో ‘మనం' మూవీలోనూ నాగార్జున.. చై సామ్ కుమారుడిగా కనిపించిన విషయం తెలిసిందే.

  English summary
  Tollywood Senior Hero Akkineni Nagarjuna Doing Bangarraju Movie Under Kalyan Krishna Direction. Samantha Akkineni and Naga Chaitanya Pair Again For This Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X