Just In
- 7 hrs ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 7 hrs ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- 8 hrs ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
- 9 hrs ago
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఇదే.!
Don't Miss!
- News
జర్మనీ యూనివర్శిటీలో కేరళ విద్యార్థిని: అనుమానస్పద స్థితిలో..చివరి ఫోన్ కాల్.. !
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Lifestyle
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సమంత, నాగ చైతన్యను కలిపిన వంద కోట్ల డైరెక్టర్.. మళ్లీ పెళ్లి చేసుకోనున్న సినీ జంట.!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని వారి అబ్బాయి నాగ చైతన్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వివాహానికి ముందు ఏ విధంగానైతే సినిమాలు చేశారో.. ఆ తర్వాత కూడా వీళ్లు తమ తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. షూటింగ్ సమయాలను మినహాయిస్తే.. ఖాళీగా ఉంటే ఫారెన్ చెక్కేసి హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలో, వీడియోలో బయటకు రావడంతో ఈ జంట తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సమంత, నాగ చైతన్య పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇద్దరూ కలిసి సక్సెస్ అయ్యారు
వివాహం తర్వాత సమంత వరుస విజయాలను దక్కించుకుంది. అయితే, నాగ చైతన్య మాత్రం ముందు నుంచీ సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వీళ్లిద్దరితో శివ నిర్వాణ ‘మజిలీ' అనే సినిమాను చేశాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టింది.

దాని తర్వాత చైతూ ఇలా.. సమంత అలా
సూపర్ హిట్ సినిమా ‘మజిలీ' తర్వాత నాగ చైతన్య రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఇప్పటికే అతడు వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ' అనే సినిమాలో నటించాడు. దీనితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ సినిమా చేస్తున్నాడు. మరోవైపు, సమంత మాత్రం ‘96' తెలుగు రీమేక్ మినహా మరో సినిమాకు సంతకం చేయలేదు.

సమంత తల్లి కాబోతుందనే అనుమానాలు
సమంత సినిమాలు ఒప్పుకోకపోవడంతో ఆమె తల్లి కావాలనుకుంటోందని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిని ఎవరూ ఖండించకపోవడంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడలేదు. కానీ, ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ‘2022 ఆగస్ట్ ఏడో తేదీన... ఉదయం ఏడు గంటలకు నేను ఓ బేబీకి జన్మనివ్వబోతున్నా' అని వ్యంగ్యంగా సమాధానం చెప్పి క్లారిటీ ఇచ్చేసింది.

వంద కోట్లు కొట్టినా అవకాశం రాలేదు
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం'. ఈ సినిమాను పరశురాం తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాలో పరశురాం టెక్నికల్ స్కిల్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కానీ, అతడు ఇప్పటి వరకు మరో సినిమాను ప్రకటించలేదు.

చైతూ, సామ్‌ను కలిపాడు
పరశురాం ‘గీత గోవిందం' హిట్ అయిన తర్వాత నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు సహా ఎంతో మంది హీరోలకు కథలు చెప్పాడు. చాలా మంది కథలు నచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమాలు చేయలేకపోయారు. తాజాగా ఈయనకు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

మళ్లీ పెళ్లి చేసుకుంటారట
ఈ సినిమా కూడా పరశురాం స్టైల్‌లోనే ఉంటుందని అంటున్నారు. ఆయన గత చిత్రాలన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కాయి. దీంతో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని సమాచారం. ఇందులో సమంత, నాగ చైతన్య భార్య భర్తలుగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. తర్వాత వీళ్ల లైఫ్‌లో జరిగిన పరిణామాలే సినిమా కథ అని తెలిసింది.