Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పాపం సమంత! ఆ పని చేయక తప్పలేదట.. కారణం ఆ ముగ్గురే
స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత ఓ ముగ్గురు స్టార్ హీరోల కారణంగా వెనక్కితగ్గ వలసి వచ్చిందట. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీలో సూపర్ జోష్ కంటిన్యూ చేస్తున్న ఆమెకు ఆ ముగ్గురు బ్రేకులు వేశారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..
ఓ బేబీ స్పీడు.. సడెన్ బ్రేక్స్
వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న సమంత ఇటీవలే ఓ బేబీగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ఈ మూవీ అంచనాలను మించి రాణించింది. దీంతో అదే జోష్‌లో శర్వానంద్ సరసన చేరింది సామ్. కానీ ఆమె స్పీడుకు సడెన్ బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల కోసం సమంత
హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సమంతకు 96 కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసింది. తమిళ సినిమా రీమేక్ సినిమాగా అదే పేరుతో తెలుగులో రాబోతున్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఒరిజినల్ వర్షన్ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసేశారు కూడా.
దిల్ రాజు అనుకున్నారు కానీ.. ముగ్గురు స్టార్ హీరోలు
దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను నవంబర్ నెలాఖరులో విడుదల చేయాలనుకుంది చిత్రయూనిట్. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడంతో, డిసెంబర్లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట దిల్ రాజు. ఇంతలో అనుకోకుండా ముగ్గురు స్టార్ హీరోలు సమంతకు అడ్డుపడటం హాట్ టాపిక్ అయింది.
బాలకృష్ణ సహా మెగా ఫ్యామిలీ హీరో కూడా
ఎప్పుడు సంక్రాంతి సీజన్లో వచ్చే బాలకృష్ణ.. ఈ సారి మాత్రం డిసెంబర్ 20కే దిగేస్తున్నారు. అది కూడా 'రూలర్'గా. ఇక నాకేం తక్కువ అన్నట్లు అదేరోజు సాయి ధరమ్ తేజ్ కూడా 'ప్రతిరోజూ పండగే' అంటున్నాడు. వీళ్లిద్దరికీ పోటీగా డిసెంబర్ 25 వ తేదీన డిస్కో రాజా అంటూ రవితేజ లైన్ లోకి వచ్చేశాడు. సో ఈ ముగ్గురి కారణంగా సమంత సినిమాను డిసెంబర్ నెల నుంచి సైడ్ చేసేశారట మేకర్స్.
వెనకడుగేసిన సమంత.. ఆమె క్రెడిట్
డిసెంబర్ కూడా పూర్తి చేసేసి వచ్చే ఏడాది ఫ్రెష్‌గా 96 రూపంలో సమంతను వెండితెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ రకంగా సమంత వెనక్కి తగ్గడానికి ఆ ముగ్గురు స్టార్ హీరోలు కారణమయ్యారు. ఏది ఏమైనా, ఎప్పుడొచ్చినా సమంత క్రెడిట్ సమంతకే ఉంటుంది.. అది వేరు విషయం. కానీ, వాళ్ళతో మనకెందుకు పోటీ అన్నట్లుగా మేకర్స్ సైలెంట్ అయ్యారని టాక్.
దాన్ని క్యాచ్ చేస్తూ సామ్..
ఇక మరోవైపు పెరుగుతున్న ఆధునికతను క్యాచ్ చేసుకునేలా సమంత ప్లాన్ చేస్తోందని, ఇందులో భాగం గానే ఓ వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసిందనేది తాజా సమాచారం. ఈ వెబ్ సిరీస్ కూడా కొద్ది రోజుల్లోనే ఆన్లైన్ వేదికలను దున్నేయనుందని సమాచారం.