For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో సంచలనానికి సమంత సిద్ధం: ఆ హీరోల కంటే ఎక్కువే.. ఏకంగా అన్ని కోట్లు తీసుకుంటుందట

  |

  'ఏమాయ చేశావే' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవడంతో పాటు ప్రేక్షకులందరినీ మాయ చేసేసింది సమంత. ఫస్ట్ మూవీలోనే అదరగొట్టేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. ఫలితంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె హవా తెలుగుకే పరిమితం కాలేదు. కోలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈ మధ్యనే డిజిటల్ వరల్డ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అందులోనూ సత్తా చాటిన సమంత.. దేశం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే సమంత మరో భారీ ఆఫర్ పట్టేసినట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

  సోనం కపూర్ అందాల విందు.. పై అచ్చాదనలు ఏవీ లేకుండానే

  రెండు చోట్లా హవా.. అలా బ్రేక్ పడింది

  రెండు చోట్లా హవా.. అలా బ్రేక్ పడింది

  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. కొంత కాలంగా సమంత వరుస విజయాలతో దూసుకుపోతోంది. అదే సమయంలో తమిళంలోనూ హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోంది. తద్వారా రెండు చోట్లా తన హవాను చూపిస్తూ ముందుకెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘96'కు రీమేక్‌గా వచ్చిన ‘జాను'తో ఆమె విజయాలకు బ్రేక్ పడిపోయింది.

  పొట్టి బట్టలతో రోడ్డెక్కిన పాయల్.. అలా పడుకుని ఫోజులు

  డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టేసింది

  డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టేసింది

  ఎంతో కాలంగా వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో అక్కినేని వారి కోడలు నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన సమయంలో సమంత కనిపించిన తీరు ఎన్నో వివాదాలకు కారణమైంది.

  బర్త్ డే బ్యూటీ హాట్ ట్రీట్.. మామూలుగా లేదుగా

  సమంతపై ప్రశంసల వర్షం... ట్రెండింగ్

  సమంతపై ప్రశంసల వర్షం... ట్రెండింగ్

  ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. సమంతనే ఎంతో హైలైట్ అయింది. ఇందులో ఆమె చేసిన రాజీ అనే రోల్‌కు ఊహించని విధంగా పేరు వచ్చింది. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో చేసినప్పటికీ సమంత అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఫలితంగా ట్రెండ్ సెట్ చేసుకుంది.

  బ్రా లేకుండా సైడ్ యాంగిల్ లో షాకిచ్చిన షమా సికిందర్

  పాన్ ఇండియా సినిమాలో సమంత

  పాన్ ఇండియా సినిమాలో సమంత

  ‘జాను' తర్వాత సమంత సినిమాలు చేయదన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం పాటు తెలుగులో మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

  సమంతకు మరో వెబ్ సిరీస్‌ అవకాశం

  సమంతకు మరో వెబ్ సిరీస్‌ అవకాశం

  అక్కినేని సమంత ప్రస్తుతం ‘శాకుంతలం'తో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇవి తప్ప మరో సినిమా కోసం ఆమె చర్చలు కూడా జరపడం లేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు మరో వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చిందని ఇటీవల ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇది ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ద్వారా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

  మరో సంచలనానికి సిద్ధమైన సమంత

  మరో సంచలనానికి సిద్ధమైన సమంత

  నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచి వెబ్ సిరీస్‌ ఆఫర్ వచ్చినప్పటికీ సమంత దానికి అంగీకరించలేదని వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' తర్వాత సమంతకు ఉన్న క్రేజ్‌ను వాడుకోవాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోందట. అందుకు అనుగుణంగానే ఈ వెబ్ సిరీస్‌ను ఆమెకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

  ఏకంగా అన్ని కోట్లు తీసుకోబోతుందట

  ఏకంగా అన్ని కోట్లు తీసుకోబోతుందట

  నెట్‌ఫ్లిక్స్ రూపొందించే ఈ వెబ్ సిరీస్‌ను ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడట. ఇది పలు భాషల్లో రాబోతుందని తెలుస్తోంది. ఇక, ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఏకంగా రూ. 8 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకోబోతుందని సమాచారం. ఇది టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల రెమ్యూనరేషన్‌ కంటే ఎక్కువ. ఇక, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2'కు ఆమె రూ. 4 కోట్ల వరకూ చార్జ్ చేసింది.

  English summary
  Tollywood Star Heroine Samantha Akkineni to do Another Web Series. This Time She Work for Netflix. She Charged Huge Remuneration for This multiple language Series.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X