నయనతార ప్రియుడికి చెక్ పెట్టిన నాగచైతన్య.. సమంత ఎలా మేనేజ్ చేశారంటే..

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న సమంత అక్కినేని పెళ్లి తర్వాత విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్నారు. కథ, పాత్రల ఎంపికలో ఆమె చూపిస్తున్న మెచ్యురిటీ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. యూటర్న్, సూపర్ డీలక్స్, మజిలీ, ఓ బేబీ, జాను లాంటి చిత్రాలు నటిగా ఆమె పరిణతికి అద్దంపట్టాయి. ఇలా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా విలక్షణమైన పాత్రలు, విభిన్నమైన చిత్రాలకు ఓటేస్తున్నారు. అయితే ఒక సినిమా విషయంలో చైతూ, సమంత మధ్య జరిగిన చర్చ ఇప్పుడు మీడియాలో హైలెట్‌గా మారింది. ఇంతకు ఏమా సినిమా? ఎలాంటి చర్చ అంటే..

గృహ నిర్బంధంలో సమంత, చైతూ

గృహ నిర్బంధంలో సమంత, చైతూ

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులు దారుణంగా ఉండటంతో సమంత, నాగచైతన్య దంపతులు ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతించడంతో సినీ నటులంతా షూటింగులకు సిద్దమవుతున్నారు.

జూలైలో షూటింగులకు సమంత రెడీ

జూలైలో షూటింగులకు సమంత రెడీ

ఇక జూలై నుంచి సినిమా షూటింగులు మొదలు కానుండటంతో సమంత తన కెరీర్‌పై దృష్టిపెట్టారు. లాక్‌డౌన్‌కు ముందు అంగీకరించిన కాతువాకుల రెండు కాదల్ చిత్రానికి రెడీ అవ్వడం మొదలు పెట్టారట. సమంత సినిమా షూటింగులకు సిద్ధం అవ్వడం చూసి నాగచైతన్య వారించారట. ఎందుకంటే చెన్నైలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగుకు వెళ్లడానికి ఒప్పుకోలేదట. దాంతో దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు తాను సినిమా చేయకపోవచ్చనే విషయాన్ని స్పష్టం చేశారట.

విఘ్నేష్ శివన్ హామీ ఏమిటంటే...

విఘ్నేష్ శివన్ హామీ ఏమిటంటే...

అయితే కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో మీరు లేకపోతే చాలా కష్టం. మీరు లేకుండా ఆ సినిమాను ఊహించుకోలేననే విషయాన్ని నేరుగా సమంతకు విఘ్నేష్ శివన్ వెల్లడించారట. అయితే తాను షూటింగుకు సంబంధించిన జాగ్రత్తలు, కావాలంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత షూటింగు పెట్టుకొందాం. షూటింగ్ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేద్దాం. అప్పటి వరకు మీ కోసం వెయిట్ చేస్తాననే విషయాన్ని సమంతకు విఘ్నేష్ వివరించారట. దాంతో ఆ సినిమా చేయడానికి సమంత తన మనసు మార్చుకొన్నారట.

నా వల్ల సినిమాకు అన్యాయం వద్దు

నా వల్ల సినిమాకు అన్యాయం వద్దు

ఇక అదే విషయాన్ని చైతూతో చెప్పి సమంత ఒప్పించారట. తన వల్ల ఓ సినిమాకు అన్యాయం జరగడం ఇష్టం లేదు. తనపై విఘ్నేష్ శివన్ చాలా ఆశలు పెట్టుకొన్నారు. కాబట్టి పరిస్థితులు అదుపులోకి వచ్చాకే షూటింగ్ చేస్తానని తన అభిప్రాయాన్ని వివరించడంతో చైతూ కూడా కన్విన్స్ అయ్యారనే వార్త ప్రస్తుతం తమిళ మీడియాలో వైరల్‌గా మారింది.

Recommended Video

Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry
సమంత, విజయ్ సేతుపతితో కలిసి సమంత

సమంత, విజయ్ సేతుపతితో కలిసి సమంత


కాతువాకుల రెండు కాదల్ చిత్రం విషయానికి వస్తే.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా స్క్రిప్టుపై ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్టు సమంతను బాగా ప్రభావితం చేసిందనే విషయాన్ని ఇటీవల విఘ్నేష్ శివన్ స్వయంగా వెల్లడంచారు. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X