Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తప్పదనుకుంటే ఆ పని కూడా చేస్తా.. అక్కినేని సమంత షాకింగ్ డిసీజన్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, సినిమా అంటేనే గ్లామర్. కాబట్టి సినిమాల్లో హీరోయిన్స్ అన్నాక అందాల ఆరబోత, లిప్‌లాక్స్ చేయక తప్పదు. అయినా ఇలాంటివి తమ వృత్తిలో భాగమే అని, కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఓపెన్ అయ్యారు కూడా. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అదే మాట చెబుతోందట. డిమాండ్ ఉంటే దానికైనా రెడీ అంటోందట. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
పెళ్ళికి ముందు నుంచే.. పెళ్లి తర్వాత
పెళ్ళికి ముందే టాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత. గ్లామర్ రోల్స్ కూడా పోషించి ప్రేక్షకులకు కిక్కిచ్చింది. అయితే ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. ఈ మధ్యకాలంలో పాత్రల ఎంపికలో స్పెషల్ కేర్ తీసుకుంటోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల పట్ల మక్కువ చూపుతోంది.
భర్తతో మజిలీ చేసి.. ఆ వెంటనే ఓ బేబీ
అక్కినేని వారింట అడుగు పెట్టాక మొదటిసారి భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' చేసింది సమంత. ఈ సినిమాలో గృహిణిగా, చైతూ భార్యగా భేష్ అనిపించుకున్న సామ్.. ఆ వెంటనే 'ఓ బేబీ' సినిమాకు కమిట్ అయింది. ఈ సినిమాలో ఆమె పోషించిన విలక్షణ పాత్రకు విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
శర్వానంద్‌తో రొమాన్స్.. వెబ్ సిరీస్ మ్యాటర్
ఇక మరికొద్ది రోజుల్లోనే 96 రీమేక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత. ఈ సినిమాలో శర్వానంద్‌తో రొమాన్స్ చేసిన ఆమె.. మరో విలక్షణ పాత్ర పోషించిందని సమాచారం. అలాగే ప్రస్తుతం సమంత ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోందని వార్తలు వస్తున్నాయి. డిజిటల్ రంగం దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఆ క్రేజ్ కూడా క్యాచ్ చేసుకునేలా సామ్ వెబ్ సిరీస్ వైపు అడుగేసిందట.
ముఖ్యంగా అలాంటి కథల కోసమే వేట
కాగా 96 రీమేక్ తర్వాత తన తదుపరి చిత్రాల మీద దృష్టి పెట్టిన సమంత.. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు సిద్దమే అని చెబుతోందట. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ కథల కోసం ఎదురుచూస్తున్న సమంత, కథ బాగుండాలే గానీ కొత్త దర్శకులతో అయినా రెడీ అనేందుకు సిద్ధమైందని సమాచారం.
Recommended Video
డిమాండ్ ఉంటే దానికైనా ఓకే
ఇక కథ డిమాండ్ చేస్తే తాను బోల్డ్ సీన్లలో నటించేందుకు కూడా వెనకాడనని నిర్మొహమాటంగా తన సన్నిహితులతో చెప్పుకుంటోందట సామ్. ఈ మేరకు అతి త్వరలో ఓ కథ ఫైనల్ చేయాలని బలమైన డిసీజన్ తీసుకుందట సమంత. ఏదేమైనా సమంత తీరే వేరులే. వృత్తికి, పెళ్ళికి రిలేషన్ ఏంటి? అన్నట్లుగా సామ్ వెళుతున్న తీరు ప్రశంసనీయమే మరి.