For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తప్పదనుకుంటే ఆ పని కూడా చేస్తా.. అక్కినేని సమంత షాకింగ్ డిసీజన్!

|

సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా అంటేనే గ్లామర్. కాబట్టి సినిమాల్లో హీరోయిన్స్ అన్నాక అందాల ఆరబోత, లిప్‌లాక్స్ చేయక తప్పదు. అయినా ఇలాంటివి తమ వృత్తిలో భాగమే అని, కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఓపెన్ అయ్యారు కూడా. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అదే మాట చెబుతోందట. డిమాండ్ ఉంటే దానికైనా రెడీ అంటోందట. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

పెళ్ళికి ముందు నుంచే.. పెళ్లి తర్వాత

పెళ్ళికి ముందు నుంచే.. పెళ్లి తర్వాత

పెళ్ళికి ముందే టాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సమంత. గ్లామర్ రోల్స్ కూడా పోషించి ప్రేక్షకులకు కిక్కిచ్చింది. అయితే ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. ఈ మధ్యకాలంలో పాత్రల ఎంపికలో స్పెషల్ కేర్ తీసుకుంటోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల పట్ల మక్కువ చూపుతోంది.

భర్తతో మజిలీ చేసి.. ఆ వెంటనే ఓ బేబీ

భర్తతో మజిలీ చేసి.. ఆ వెంటనే ఓ బేబీ

అక్కినేని వారింట అడుగు పెట్టాక మొదటిసారి భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' చేసింది సమంత. ఈ సినిమాలో గృహిణిగా, చైతూ భార్యగా భేష్ అనిపించుకున్న సామ్.. ఆ వెంటనే 'ఓ బేబీ' సినిమాకు కమిట్ అయింది. ఈ సినిమాలో ఆమె పోషించిన విలక్షణ పాత్రకు విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

శర్వానంద్‌తో రొమాన్స్.. వెబ్ సిరీస్ మ్యాటర్

శర్వానంద్‌తో రొమాన్స్.. వెబ్ సిరీస్ మ్యాటర్

ఇక మరికొద్ది రోజుల్లోనే 96 రీమేక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత. ఈ సినిమాలో శర్వానంద్‌తో రొమాన్స్ చేసిన ఆమె.. మరో విలక్షణ పాత్ర పోషించిందని సమాచారం. అలాగే ప్రస్తుతం సమంత ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోందని వార్తలు వస్తున్నాయి. డిజిటల్ రంగం దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఆ క్రేజ్ కూడా క్యాచ్ చేసుకునేలా సామ్ వెబ్ సిరీస్ వైపు అడుగేసిందట.

ముఖ్యంగా అలాంటి కథల కోసమే వేట

ముఖ్యంగా అలాంటి కథల కోసమే వేట

కాగా 96 రీమేక్‌ తర్వాత తన తదుపరి చిత్రాల మీద దృష్టి పెట్టిన సమంత.. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు సిద్దమే అని చెబుతోందట. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ కథల కోసం ఎదురుచూస్తున్న సమంత, కథ బాగుండాలే గానీ కొత్త దర్శకులతో అయినా రెడీ అనేందుకు సిద్ధమైందని సమాచారం.

Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
డిమాండ్ ఉంటే దానికైనా ఓకే

డిమాండ్ ఉంటే దానికైనా ఓకే

ఇక కథ డిమాండ్ చేస్తే తాను బోల్డ్ సీన్లలో నటించేందుకు కూడా వెనకాడనని నిర్మొహమాటంగా తన సన్నిహితులతో చెప్పుకుంటోందట సామ్. ఈ మేరకు అతి త్వరలో ఓ కథ ఫైనల్ చేయాలని బలమైన డిసీజన్ తీసుకుందట సమంత. ఏదేమైనా సమంత తీరే వేరులే. వృత్తికి, పెళ్ళికి రిలేషన్ ఏంటి? అన్నట్లుగా సామ్ వెళుతున్న తీరు ప్రశంసనీయమే మరి.

English summary
Tollywood star heroine Samantha Akkineni creating buzz in tollywood. Now she is doing tamil remake movie 96. This movie will release on next year and effected by Balakrishna's Ruler. After this movie Samantha ready to act in bold movies.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more