క్రేజీ రీమేక్‌‌లో సమంత.. మరో ఎమోషనల్, ఫీల్‌గుడ్ లవ్ స్టోరీపై ఆసక్తి!

గత రెండేళ్ళుగా సమంత అక్కినేని వరుస విజయాలతో కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. తమిళ, తెలుగు అనే తేడా లేకుండా సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకొంటున్నారు. ఇటీవల నటించిన జాను చిత్రమే తనకు కొంత నిరాశనే మిగిల్చింది. అయినా మరోసారి సమంత రీమేక్‌ చిత్రంపై మోజు పడుతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. అయితే అత్యంత మెచ్యురిటీ ఉన్న లవ్ స్టోరీని తెలుగు, తమిళంలో చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో సమంత ఆలోచిస్తున్నట్టు పేర్కొంటున్నారు. సమంతను అంతగా కదిలించిన సినిమా ఏమిటో తెలుసుకొందామా?

లాక్‌డౌన్‌లో ఫ్యామిలీ లైఫ్

లాక్‌డౌన్‌లో ఫ్యామిలీ లైఫ్

సమంత అక్కినేని విషయానికి వస్తే.. ఇప్పుడు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ రేంజ్‌‌లో సమయాన్ని ఎంజాయ్ చేసే అవకాశం రాకపోవడంతో చైతూతో గృహస్థ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా తాను చేసే సినిమాల గురించి, చేయబోయే ప్రాజెక్టులు, స్క్రిప్టులతో బిజీగా ఉంటున్నారని విషయం తెలిసిందే.

టెర్రస్ గార్డెన్‌తో వ్యవసాయం

టెర్రస్ గార్డెన్‌తో వ్యవసాయం

ఇక లాక్‌డౌన్‌లో ప్రొఫెషన్ విషయాలపైనే కాకుండా తన అభిరుచికి తగినట్టు వ్యవసాయం కూడా మొదలుపెట్టారు. తన ఇంటిపైన మిద్దె తోట (టెర్రెస్ గార్డెన్)ను ఏర్పాటు చేసి ఇంటికి కావాల్సిన కూరగాయలను, ఆర్గానిక్ పద్దతుల్లో పండించడం మొదలుపెట్టారు. ఇటీవల తన ఇంట్లో పండిన పంటను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసి తన ఆనందాన్ని సమంత పంచుకొన్నారు.

మరో రీమేక్‌పై సమంత ఆసక్తి

మరో రీమేక్‌పై సమంత ఆసక్తి

ఇలా వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే లాక్‌డౌన్ తర్వాత చేయబోయే సినిమాలపై దృష్టి పెటినట్టు తెలుస్తుంది. యూటర్న్, హే బేబీ, జాను లాంటి వరసగా రీమేక్‌లతో హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు చేస్తున్న సమంత ఇటీవల విడుదలై అందరి ప్రశంసలు అందుకొంటున్న మలయాళ చిత్రం సూఫియం సుజాతీయం అనే చిత్రాన్ని తెలుగులో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రం కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ స్టయిల్‌లోనే ఉండటం, అంతేకాకుండా నటనకు మంచి స్కోప్ ఉండటం కూడా అందుకు కారణమని చెబుతున్నారు.

మూగ భగ్న ప్రేమికురాలిగా అదితిరావు

మూగ భగ్న ప్రేమికురాలిగా అదితిరావు


ఇటీవల మలయాళంలో రిలీజైన సూఫియం, సుజాతీయం సినిమాలో హీరోయిన్‌గా అదితిరావు హైదరీ నటించారు. పరిణతి చెందిన ప్రేమ కథలో భగ్న ప్రేమికురాలి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. అదితి రావు పాత్రకు జాతీయ వ్యాప్తంగా మంచి పేరు లభిస్తున్నది. మూగ యువతి పాత్రలో అదితి రావు నటనను నేషనల్ వెబ్‌సైట్లు ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

సూఫియం సుజాతీయం స్టోరీ ఏంటంటే

సూఫియం సుజాతీయం స్టోరీ ఏంటంటే


సూఫియం సుజాతీయం సినిమా కథ విషయానికి వస్తే.. ఓ సూఫి లేదా ఓ యువ ప్రవక్త ప్రేమలో సుజాత అనే హిందూ యువతి పడుతుంది. మూగ యువతి ప్రేమను సూఫీ కూడా అంగీకరిస్తాడు. వారిద్దరి ప్రేమకు అడ్డంకిగా ఎలాంటి సంఘటనలు అడ్డుపడ్డాయి? హిందూ యువతి, ముస్లిం యువకుడు ప్రేమ సుఖాంతమైందా? లేదా విషాదంగా మారిందా అనేది సినిమాకు ముగింపు. అయితే బలమైన పాత్రలు, నటనకు ఆస్కారం ఉండటంతో సినీ విమర్శకులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.

Recommended Video

Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry
మ్యూజిక్, సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్

మ్యూజిక్, సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్


ఇక సూఫియం సుజాతీయం సినిమాలో సాంకేతి అంశాలకు పుష్కులంగా పెద్ద పీట వేశారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమైన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. మొత్తంగా ఈ సినిమాను అదితిరావు హైదరీ తన భుజాలను మోసిందని, మూగ యువతి పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చిందనే ప్రశంసను సొంతం చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X