రూటు మార్చేస్తున్న సమంత.. బయోపిక్‌తో సందడి చేసేందుకు సిద్ధం!
అంతర్జాతీయ బ్యాట్మింటన్ పోటీల్లో తెలుగు తేజం పీవీ సింధు విశేష ఖ్యాతి తెచ్చుకుంటోంది. గతంలో అనేక పతకాలు చేజిక్కించుకొని తన టాలెంట్ చూపించిన ఈమె.. ఇటీవలే జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం గెలిచి భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. దీంతో కొందరు దర్శకనిర్మాతలు పీవీ సింధు జీవితానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పీవీ సింధు బయోపిక్ తీయాలని డిసైడ్ అయ్యాడు సోనుసూద్.
అయితే ఈ బయోపిక్‌లో లీడ్ రోల్ ఎవరు పోషిస్తే బాగుంటుందని అనుకున్న సోనుసూద్.. చివరకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. మొదట బాలీవుడ్ హీరోయిన్ తోనే ఈ బయోపిక్ ను రూపొందించాలని ఆయన ప్లాన్ చేసినప్పటికీ చివరకు మనసు మార్చుకుని, సమంతతో చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం సమంతతో ఇందుకు సంబందించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

ఇటీవలే 'ఓ బేబీ' రూపంలో గ్రాండ్ సక్సెస్ సొంతం చేసుకున్న సమంత ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది. ఇది మినహాయిస్తే మరే సినిమాకు సమంత సంతకం చేయలేదు. దీంతో పాత్ర పరిధి ఎక్కువగా ఉండే పీవీ సింధు బయోపిక్ లో సమంత నటించడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే గతంలో హీరోయిన్ గా మాత్రమే నటించిన సమంత.. రూటు మార్చేస్తూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గుతోందని తెలుస్తోంది కదూ!.


Click it and Unblock the Notifications











