For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తల్లి కాబోతున్న సమంత: ఆ ఫొటోకు అర్థం అదేనా? గుడ్ న్యూస్ అలా చెప్పిన అక్కినేని కోడలు

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. 'ఏమాయ చేశావే' అనే సినిమాతో వచ్చిన ఈ భామ.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. వరుసగా హిట్లు మీద హిట్లు అందుకుంటూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఇక, ఈ మధ్య సినిమాల వేగం తగ్గించిన ఈమె.. వెబ్ సిరీస్‌తో ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక, ఇప్పుడు సమంత తల్లి కాబోతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆమె చేసిన పోస్టే. వివరాల్లోకి వెళ్తే..'

  The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
  అక్కడా.. ఇక్కడా సత్తా.. హిట్లకు బ్రేక్

  అక్కడా.. ఇక్కడా సత్తా.. హిట్లకు బ్రేక్

  ఈ మధ్య కాలంలో సమంత వరుస విజయాలతో దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోంది. దీంతో ఈ బ్యూటీ అక్కడా ఇక్కడా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘96'కు రీమేక్‌గా వచ్చిన ‘జాను'తో ఆమె విజయాలకు బ్రేక్ పడిపోయింది. దీని తర్వాత ఆమె సినిమాల వేగం బాగా తగ్గించేసింది.

  వెబ్ సిరీస్‌ వచ్చేసింది... వివాదాలతో

  వెబ్ సిరీస్‌ వచ్చేసింది... వివాదాలతో

  సుదీర్ఘ కాలంగా వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా తన హవాను చూపించిన సమంత.. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన సమయంలో సమంత కనిపించిన తీరు ఎన్నో వివాదాలకు కారణమైంది.

  రాజీపై జాతీయ స్థాయిలో ప్రశంసలు

  రాజీపై జాతీయ స్థాయిలో ప్రశంసలు

  ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ.. అక్కినేని సమంత పాత్రే ఎంతో హైలైట్ అయింది. ఇందులో ఆమె చేసిన రాజీ అనే రోల్‌కు ఎంతగానో పేరు వచ్చింది. తొలిసారి బోల్డుగా, నెగెటివ్ షేడ్స్‌తో చేసినప్పటికీ సమంత అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఫలితంగా ట్రెండ్ సెట్ చేసుకుంది సామ్.

  సమంత చేతిలో మిగిలింది అదొక్కటే

  సమంత చేతిలో మిగిలింది అదొక్కటే

  ‘జాను' తర్వాత సమంత సినిమాలు చేయదన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం పాటు తెలుగులో మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

  అందులో బిజీగా ఉంటూ రచ్చ చేస్తూ

  అందులో బిజీగా ఉంటూ రచ్చ చేస్తూ

  సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అక్కినేని సమంత సోషల్ మీడియాలో కూడా చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే అక్కినేని కోడలికి తెలుగులో ఏ హీరోకూ లేనంత మంది ఫాలోవర్లు ఉండడం విశేషం.

  తల్లి కాబోతున్న అక్కినేని సమంత

  తల్లి కాబోతున్న అక్కినేని సమంత

  కొన్నేళ్ల క్రితం స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారసుడు నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండేళ్లుగా ఈమె గర్భవతి అని తరచూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ అక్కినేని వారి కోడలు.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేసింది. దీని వల్ల ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి.

  గుడ్ న్యూస్ అలా చెప్పిన సమంత

  గుడ్ న్యూస్ అలా చెప్పిన సమంత

  తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోలో ఆమె మునుపటి కంటే బొద్దుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఈ పిక్‌లో మామిడి కాయను కూడా హైలైట్ చేసింది. దీంతో తాను గర్భవతిని అయ్యానని ఆమె పరోక్షంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అసలే ఈ వార్త కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు అభిమానులు. ఇలాంటి సమయంలో ఈ ఫొటో మరిన్ని అనుమానాలను పెంచేస్తోంది.

  English summary
  Samantha Akkineni Very Active in Social Media. Now She Shared Mango Photo in her Instagram. This pic Created So Many Doubts on her Pregnancy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X