‘బాహుబలి’నే లైట్ తీసుకున్నారు.. సమంత సినిమాను ఆదరిస్తారా..?

అక్కినేని సమంత నటించిన చిత్రం 'ఓ బేబి'. ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే దాదాపు రూ. 20 కోట్ల గ్రాస్‌ను సైతం సొంతం చేసుకుంది. ఈ మధ్యలో విడుదలైన ఎన్నో సినిమాలను వెనక్కి నెడుతూ ఫుల్ రన్‌లో దూసుకుపోతుంది 'ఓ బేబి'.

తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేయబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని హిందీలోకి తీసుకెళ్లబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు, దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా.. బాలీవుడ్ నటి ఆలియాతో చర్చలు కూడా జరుపుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త ఒకటి చర్చనీయాంశం అవుతోంది.

Samantha Akkineni Oh Baby Will Release In China

ఈ సినిమాను చైనాలో విడుదల చేయబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. 'ఓ బేబి'ని చూసిన కొందరు డిస్టిబ్యూటర్లు.. ఈ సినిమాను చైనా విడుదల చేయడానికి ముందుకు వచ్చారని ప్రచారం జరుగుతోంది. దీనికి చిత్ర బృందం కూడా ఓకే చెప్పేసిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే సినిమాను చైనాలో విడుదల చేస్తారని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

ఈ క్రమంలోనే కొందరు సరికొత్త అనుమానాలను లేవనెత్తుతున్నారు. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'ని చైనాలో విడుదల చేశారు. అయితే, అక్కడ ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఓ బేబి'ని అక్కడి వారు ఆదరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X