సమంత షాకింగ్ డిసీజన్.. గోవా బీచ్ దగ్గర్లో అలా! ఇదీ అసలు స్కెచ్..

టాలీవుడ్ మోస్ట్ ఫేమస్ స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంత పేరు ముందువరుసలో ఉంటుంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా అక్కినేని కోడలిగా, గ్లామర్ బ్యూటీ సామ్ అలరిస్తున్న తీరు యువ హృదయాలను కొల్లగొడుతోంది. సినిమాల సంగతి అటుంచితే.. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తీసుకున్న ఓ డిసీజన్ షాకిస్తోంది. ప్రస్తుతం అంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటా డిసీజన్? వివరాల్లోకి పోతే..

వెకేషన్స్ అంటే పిచ్చి.. ఆయనతో కలిసి జాలీగా

వెకేషన్స్ అంటే పిచ్చి.. ఆయనతో కలిసి జాలీగా

ఇప్పటిదాకా సమంత వేసిన వెకేషన్ ట్రిప్స్ చూస్తే ఆమెకు వెకేషన్స్ అంటే ఎంత పిచ్చి అనేది అర్థం చేసుకోవచ్చు. ఏ మాత్రం సమయం దొరికిన భర్త నాగచైతన్యతో కలిసి అలా జాలీ ట్రిప్ వేస్తుంది సామ్. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆయా వెకేషన్ విశేషాలు, ఫోటోలు అభిమానులతో పంచుకొని కిక్కిస్తుండటం సమంత హ్యాబీ.

 సమంత ఫ్యూచర్ ప్లాన్స్.. ఇప్పటినుంచే!

సమంత ఫ్యూచర్ ప్లాన్స్.. ఇప్పటినుంచే!

ప్రస్తుతం చేతినిండా యాడ్స్, సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పటినుంచే వేస్తోందట. ఈ మేరకు రిటైర్మెంట్ తర్వాత తన సౌధం ఎలా ఉండాలి? పిల్లలు పుట్టాక జాలీగా ఎక్కడ గడపాలి? అనే కోణంలో ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

జాలీగా గడిపేందుకు సరైన ప్లేస్.. గోవా బెటర్

జాలీగా గడిపేందుకు సరైన ప్లేస్.. గోవా బెటర్

పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. తనకు పిల్లలు పుట్టిన తర్వాత సినిమాల జోలికి రానని ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది సామ్. ఈ మేరకు పిల్లలు పుట్టిన తర్వాత సరదాగా గడిపేందుకు సరైన ప్లేస్ ఏంటి? అనేదానిపై దృష్టిపెట్టిందట సమంత. అయితే ఇందుకు గోవా బెటర్ అని భావించిన ఆమె అక్కడే ఇల్లు కట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

అక్కడే సెటిల్.. సొంతిళ్లు ప్లాన్

అక్కడే సెటిల్.. సొంతిళ్లు ప్లాన్

నాగచైతన్యతో పెళ్లి జరిగిన తర్వాత చాలా సార్లు గోవా వెళ్ళింది సమంత. గోవా అంటే ఈమెకు చాలా ప్రత్యేకం. జీవితంలో ప్రతీ చిన్న సెలబ్రేషన్‌ను అక్కడే జరుపుకుంటూ వస్తోంది సమంత. అందుకే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా అక్కడే సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తున్నట్లుంది. అందుకే ఓ సొంతిళ్లు ప్లాన్ చేస్తోంది.

బీచ్‌కు దగ్గరలో.. భారీగా ఖర్చు

బీచ్‌కు దగ్గరలో.. భారీగా ఖర్చు

బీచ్‌కు దగ్గరలో అద్భుతమైన వ్యూ ఉండేలా సొంతిల్లు ఉండాలని భావిస్తోందట సమంత. దీనికోసం భారీగానే ఖర్చు పెడుతున్నారని టాక్. ఆమె సొంతిల్లు కోసం ఇప్పటికే గోవా అంతా జల్లెడ పడుతున్నారు సమంత సన్నిహితులు. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ గోవాలో ఇల్లు తీసుకోవడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.

Recommended Video

Jaanu Teaser : Fans Comparing Samantha With Trisha || Jaanu Vs 96
 సమంత 'జాను'

సమంత 'జాను'

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'ఓ బేబీ' సినిమాతో కిక్కిచ్చిన సామ్.. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా 'జాను' సినిమాలో నటిస్తోంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. 96 రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X