సమంత 96 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫైనల్‌గా ఇలా డిసైడ్ అయ్యారా?

వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న సమంత ఇటీవలే ఓ బేబీగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ఈ మూవీ అంచనాలను మించి రాణించింది. దీంతో అదే జోష్‌లో శర్వానంద్ సరసన చేరింది సామ్. తమిళంలో '96' పేరుతో విడుదలై భారీ సక్సెస్ సాధించిన సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో శర్వానంద్- సమంత జోడీగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతోంది. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్, తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ సినిమా రిలీజ్ విషయమై గందరగోళం నెలకొంది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను నవంబర్ నెలాఖరులో విడుదల చేయాలనుకుంది చిత్రయూనిట్. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడంతో, డిసెంబర్‌లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట దిల్ రాజు. ఇంతలో అనుకోకుండా ముగ్గురు స్టార్ హీరోలు సమంతకు అడ్డుపడటంతో వాయిదా వేశారు.

 Samantha Akkinenis 96 Release Date Fix

చివరకు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సమంత 96 సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయాలని మొదట భావించారు. కానీ అదే రోజు విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా విడుదల కానుండటంతో ఫైనల్‌గా 96 సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీనిపై అతిత్వరలో అఫీషియల్ స్టేట్‌మెంట్ రానుందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X