షాకింగ్‌గా సమంత రోజు వారి సంపాదన: ఆ ఒక్క దానికే అంత తీసుకుంటుందా!

దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది గ్లామరస్ క్వీన్ సమంత. అందానికి అందం.. నటనకు నటనను కనబర్చుతూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటోన్న ఈ అమ్మడు.. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా అన్ని భాషల్లోనూ తన మార్కును సెట్ చేసి పెడుతోంది. ఇలాంటి సమయంలో ఈ అక్కినేని వారి కోడలు ఒక రోజుకు ఎంత తీసుకుంటుంది అనే వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసం!

రెండు చోట్లా సక్సెస్.. వరుస విజయాలకు బ్రేక్

రెండు చోట్లా సక్సెస్.. వరుస విజయాలకు బ్రేక్


'ఏమాయ చేశావే'తో హీరోయిన్‌గా పరిచయమై.. అప్పటి నుంచి తన సత్తాను చూపిస్తూనే ఉంది సమంత. ఇటీవలి కాలంలో తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా విజయాలను అందుకుంటూ వచ్చిందామె. అదే సమయంలో కొన్ని అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌లు కూడా చేసింది. ఈ అక్కినేని వారి కోడలు విజయ పరంపరకు గత ఏడాది వచ్చిన 'జాను' బ్రేక్ వేసేసిందనే చెప్పాలి.

డిజిటల్ వరల్డ్‌లోకి సామ్... ఎప్పుడు వస్తుందో

డిజిటల్ వరల్డ్‌లోకి సామ్... ఎప్పుడు వస్తుందో


హీరోయిన్‌గా వెండితెరపై సత్తా చాటిన సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ను.. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి నుంచి స్ట్రీమ్ కావాల్సి ఉన్నా.. ఇది ఇంకా రాలేదు.

సినిమాలు లేకున్నా... అలా సంపాదించేసింది

సినిమాలు లేకున్నా... అలా సంపాదించేసింది

లాక్‌డౌన్ సమయంలో సినిమాలు లేకపోవడంతో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం 'సామ్ జామ్' అనే షోతో రియల్ హోస్ట్ చేసింది సమంత. సినీ సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేసే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకోన్న ఆమె.. అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ తెగ సందడి చేసింది. అదే సమయంలో ఈ షో ద్వారా రూ. రూ. 1.50 కోట్లు అందుకుందట.

పాన్ ఇండియా సినిమాలో అక్కినేని సమంత

పాన్ ఇండియా సినిమాలో అక్కినేని సమంత


'జాను' తర్వాత సమంత సినిమాలు చేయదన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం పాటు తెలుగులో మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

మలయాళ హీరోను తీసుకొచ్చిన స్టార్ డైరెక్టర్

మలయాళ హీరోను తీసుకొచ్చిన స్టార్ డైరెక్టర్

'శాకుంతలం' మూవీ లేడీ ఓరియెంటెడ్‌గా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక, ఇందులో దుష్యంతుడి పాత్ర కోసం మలయాళ హీరో దేవ్ మోహన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇదే సినిమాలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

షాక్‌కు గురి చేస్తోన్న సామ్ రోజు వారి సంపాదన

షాక్‌కు గురి చేస్తోన్న సామ్ రోజు వారి సంపాదన

'శాకుంతలం' మూవీ పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది. దీంతో ఈ సినిమా కోసం అక్కినేని సమంత భారీగానే చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ఆమె 150 రోజులు డేట్స్ కేటాయించిందట. ఇందుకోసం ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకోనుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అంటే రోజుకు రూ. 2 లక్షలు సంపాదించనుంది అన్న మాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X