సమంత ప్రెగ్నెంట్.. భారీ ప్రాజెక్ట్‌ను తప్పుకోవడంతో భగ్గుమంటూ..

అందాల భామ సమంత అక్కినేని గత రెండేళ్లుగా దక్షిణాదిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. పెళ్లి తర్వాతనే ఆమె కెరీర్‌ గ్రాఫ్ రివ్వును దూసుకెళ్తున్నది. అయితే గత కొద్దికాలంగా ఆమెను ప్రెగ్నెన్సీ వార్తలు వెంటాడుతున్నాయి. అయితే ప్రతీసారి వాటిపై సమంత స్పందించడమో.. ఖండించడమో జరుగుతున్నది. తాజాగా ఓ భారీ ప్రాజెక్టు నుంచి వైదొలగడంతో మరోసారి సమంత గర్భవతి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

 తమిళ సినిమా నుంచి అవుట్

తమిళ సినిమా నుంచి అవుట్

తమిళంలో ఇటీవల ఓ భారీ ప్రాజెక్టుకు సమంత అక్కినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రూపొందించే కాతు వాకులా రెండు కాదల్ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించడానికి అంగీకరించారు. అయితే ప్రస్తుతం ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో కోలీవుడ్‌లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది.

అసలు కారణం అదేనంటూ

అసలు కారణం అదేనంటూ

తమిళంలో భారీ సినిమాను వదులుకోవడం వెనుక అసలు కారణం సమంత గర్భవతి కావడమే అంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తపై అటు నాగచైతన్య గానీ, సమంత గానీ పెద్దగా స్పందించకపోవడంతో ఈ వార్తలో అసలు విషయం ఎంత అనేది స్పష్టం కావడం లేదు. ఈ వార్తలపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

రెండేళ్ల క్రితం ప్రేమలో

రెండేళ్ల క్రితం ప్రేమలో

సమంత, నాగచైతన్య గత రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేశావో చిత్రం షూటింగ్‌లో జరిగిన పరిచయం ప్రేమ వ్యవహారంగా మారడం.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో హిందూ, క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకొన్న విషయం విదితమే.

Recommended Video

Samantha Latest Pic Goes Viral || ఇన్స్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ పిక్ || Filmibeat Telugu
 సమంత చేస్తున్న సినిమాలు ఇవే

సమంత చేస్తున్న సినిమాలు ఇవే

సమంత కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ఆమె నటించిన జాను చిత్రం తెలుగులో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. కాతు వాకులా రెండు కాదల్ చిత్రంతోపాటు అశ్విన్ శరవణన్ సినిమాకు ఒకే చెప్పారు. ప్రస్తుతం కాతు వాకులా రెండు కాదల్ సినిమా నుంచి తప్పుకొన్నట్టు వార్తలు అందుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X