For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమంత ఒంటరి ప్రయాణం ఎక్కడికి.. ఏకంగా వాళ్ళకు సెలవులు ఇచ్చేసి.. షాకింగ్ నిర్ణయం

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రముఖ జంట విడాకులకు సిద్ధంగా ఉందని వార్తలు అందరినీ షాక్ కు గురి చేసింది. వారు మరెవరో కాదు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఉండే సమంత అక్కినేని నాగ చైతన్య అక్కినేని. గత నాలుగేళ్లుగా వివాహబంధంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరు హటాత్తుగా ఎందుకు విడిపోవాలని అని అనుకుంటున్నారు ఊహాగానాలు చాలానే వచ్చాయి. అభిమానులు అయితే ఈ విషయం అబద్ధం అనే అనుకుంటున్నారు. అయితే ఆ వార్తలపై సమంత కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వకుండా ఎప్పటిలాగే తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల మీడియా కథనాలను ఆగ్రహంతో కుక్కల ఫోటోలను పోస్ట్ చేస్తూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ రూమర్స్ డోస్ అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మరొక షాకింగ్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒంటరిగా సమంత ఎవరికి తెలియకుండా ఒక చోటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

  గొడవలపై గతంలోనే ఒక క్లారిటీ

  గొడవలపై గతంలోనే ఒక క్లారిటీ

  సమంత నాగ చైతన్య ఇద్దరూ కలిసి మొదట ఏ మాయ చేసావే సినిమా లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా వరకు దారి తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు 2017లో వివాహబంధంతో మరింత దగ్గరయ్యారు. ఇరు కుటుంబాల సంప్రదాయాలను గౌరవించి పెళ్లి చేసుకున్న సమంత నాగ చైతన్య గడచిన నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా గడిపారు. తమ ఇద్దరి మధ్య గొడవలు జరిగితే ముందుగా చైతన్యునే సర్దుకుని సారీ చెబుతారని కూడా సమంత చాలా ఇంటర్వ్యూలో చెప్పింది.

  ఆ వేడుకకు రాకపోవడంతో..

  ఆ వేడుకకు రాకపోవడంతో..

  ఎంతో ఆనందంగా ఉండే ఈ దంపతులను చూసి సౌత్ ఇండస్ట్రీ లో కూడా వారికి అభిమానులు ఫాలోయింగ్ కాస్త ఎక్కువ ఆయుయిందనే చెప్పాలి. నాగచైతన్య కెరీర్ కోసం కూడా సమంత ప్రత్యేకంగా కథలను కూడా వినడం మొదలు పెట్టింది. అయితే ఇటీవల ఏమైందో ఏమో గాని కాస్త దూరం కూడా పెరిగిందని కథనాలు వెలువడ్డాయి. ఇక యాదృచ్ఛికంగా జరిగాయి లేక మరేదైనా జరిగిందో ఏమోగానీ సమంత సోషల్ మీడియాలో సడన్ గా తన పేరు మార్చుకోవడం, అలాగే అక్కినేని వారి కుటుంబంలో జరిగిన నాగార్జున పుట్టినరోజు వేడుకకు కూడా ఆమె రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

   ప్రశాంతత కరువైందని ఒంటరిగా సమంత

  ప్రశాంతత కరువైందని ఒంటరిగా సమంత

  సమంత తన మామ నాగార్జునకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. అయితే అందుకు నాగార్జున కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు సమంత ప్రశాంతత కరువైందని ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ వివాదంపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అనవసరమైన విషయాలపై నేను ఎంత మాత్రం స్పందించను అని చెప్పింది. అయితే ఆ విషయంలో ఏది ఎంత వరకు నిజం అనేది మాత్రం ఆమె సరిగ్గా క్లారిటి ఇవ్వలేదు.

   సమంత ఎక్కడ ఉంది?

  సమంత ఎక్కడ ఉంది?

  రీసెంట్ గా సమంత రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం సినిమా షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. అయితే ఈ క్రమంలో సమంత కొన్ని నెలల పాటు తన పర్సనల్ స్టాఫ్ కు కూడా సెలవులు ప్రకటించినట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది అనే విషయం ఎవరికీ తెలియడం లేదని ముంబై గోవా చెన్నై లలో ఎదో ఒక చోటుకు వెళ్ళి ఉండవచ్చని తెలుగు మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఫిట్నెస్ ట్రైనర్ శిల్పరెడ్డి పర్సనల్ డాక్టర్ మంజుల తో మాత్రమే సమంత టచ్ లో ఉన్నట్లు స్టోరీలు రాస్తున్నారు.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  గొడవకు అసలు కారణం?

  గొడవకు అసలు కారణం?

  ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక టాక్ ప్రకారం సమంత ముంబైకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2తో ఆమె బాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అలాగే శకుంతలం సినిమాపై కూడా ఆమె భారీగా నమ్మకం అయితే పెట్టుకుంది. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముంబై కి వెళ్లాలని ఆలోచనలను నాగచైతన్య ముందుకు తీసుకు రాగా ఇద్దరి మధ్య కొంత విభేదాలు వచ్చినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. గొడవలకు అసలు కారణం అదేహనని కూడా తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  English summary
  Samantha akkineni shocking decision on rest and behind the reason on divorce issue,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X