భారీ ఆఫర్ రావడంతో సమంత కీలక నిర్ణయం.. వాటిలో కూడా నటించబోతుందట

'ఓ బేబీ' సక్సెస్‌తో మాంచి జోష్ మీదుంది అక్కినేని వారి కోడలు సమంత. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తక్కువ రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టి.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అంతేకాదు, ఫుల్ రన్‌లోనూ భారీ సీట్ ఆక్యూపెన్సీని దక్కించుకుంటోంది ఈ సినిమా. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతోంది సామ్ బేబీ. ఇందులో భాగంగానే ఆమె తాజాగా ఓ క్రేజీ ఆఫర్‌ను పట్టేసిందని ప్రచారం జరుగుతోంది.

సినిమాల్లో సత్తా చాటుతూ వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్కినేని సమంత.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతుందట. దీనిని ప్రముఖ డిజిటల్ మీడియా దిగ్గజం అమేజాన్ ప్రైమ్ తెరకెక్కించబోతుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సదరు సంస్థ సమంతకు భారీ ఆఫర్ ఇచ్చిందని కూడా తెలుస్తోంది.

Samantha Akkineni Signs For Amazon Primes Web Series

దీనికితోడు, అది హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరిగే స్టోరీ కావడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత ఏ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనడం లేదు. కాబట్టి వీలైనంత త్వరగా వెబ్ సిరీస్ ప్రారంభించాలని అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో చెప్పేసిందట.

ఈ వెబ్ సిరీస్‌ను బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇప్పటికే దీనిపై స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందని తెలిసింది. ఇది సందేశాత్మకంగా ఉంటూనే.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందట. ఈ కారణంగానే సమంత ఒప్పుకుందన్న ప్రచారమూ జరుగుతోంది.

అయితే, ఇటీవల సమంత తన అభిమానులతో ఇంటారాక్ట్ అయిన సందర్భంలో ఓ వ్యక్తి మీరు నెట్‌ఫ్లిక్స్ తరహా వెబ్‌ సిరీస్‌లు చేయొచ్చు కదా అని ప్రశ్నించాడు. దీనికి సామ్ ఏమీ సమాధానం చెప్పలేదు. సో.. ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోబట్టే ఆమె ఏమీ మాట్లాడలేకపోయిందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో సమంత నిజంగానే వెబ్ సిరీస్‌లో నటిస్తుందని ఆమె అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X