Don't Miss!
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్‌బాస్ తెలుగు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్.. నాగార్జున స్థానంలో ఆ రెండు రోజులు..
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు ఓ వారం హోస్ట్ నాగార్జున దూరమవుతున్నారనే వార్తలు కొద్ది వారాలుగా జోరందుకొన్నాయి. దాంతో ఆయన స్థానంలో హోస్ట్‌గా వ్యవహరించనున్నారని పలువురు హీరోయిన్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నాగార్జున స్థానంలో టాప్ అండ్ యంగ్ హీరోయిన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాగ్ స్థానంలో హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరంటే..
రమ్యకృష్ణ పేరు తెరపైకి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3కు అక్కినేని నాగార్జున ఓ వారంపాటు దూరం కావడంతో అనూహ్యంగా రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమె తనదైన శైలిలో ఇంటి సభ్యులను వేదిక మీద నుంచి కంట్రోల్ చేస్తూ ఆకట్టుకొన్నారు. రెండు రోజులపాటు వేదికపై గర్జిస్తూ ఆహ్లాదకరంగా షోను నడిపించారు. అయితే నాగభైరవ సీరియల్ కారణంగా ఈ ఆఫర్‌ను వదిలేసుకొన్నట్టు సమాచారం.
జబర్దస్త్ రోజా పేరు వార్తల్లోకి
ఇక రమ్యకృష్ణ పేరు తర్వాత సీనియర్ హీరోయిన్ రోజా పేరు మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఇప్పటికే టెలివిజన్ రంగంలో పలు మార్లు హోస్ట్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అయితే బిగ్‌బాస్ హెస్ట్‌గా రోజా పేరు పరిశీలనలోకి రాలేదనే విషయం సినీ వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్ 24, 25 తేదీలలో నాగ్
అయితే తాజా సమాచారం ప్రకారం వైల్డ్ డాగ్ సినిమా షూటింగు కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్తున్నారు. అక్టోబర్ 24, 25 తేదీలలో హోస్ట్‌గా అందుబాటులో ఉండరనేది బిగ్‌బాస్ వర్గాల సమాచారం. ఇక ఆయన స్థానంలో తన కోడలు సమంత బాధ్యతలను స్వీకరించనున్నట్టు ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.
Recommended Video
దసరా పండుగ నేపథ్యంలో సమంత అక్కినేని హోస్ట్‌గా
ఇక దసరా పండుగను పురస్కరించుకొని రాబోయే వారాంతపు షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించడానికి అంగీకరించారు అని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే సమంత నుంచి గానీ, బిగ్‌బాస్ నిర్వాహకులు ఎండెమాల్ షైన్ ఇండియా వర్గాలు కూడా ధృవీకరించకపోవడంతో తాజా వార్తపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.