twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ తెలుగు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్.. నాగార్జున స్థానంలో ఆ రెండు రోజులు..

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు ఓ వారం హోస్ట్ నాగార్జున దూరమవుతున్నారనే వార్తలు కొద్ది వారాలుగా జోరందుకొన్నాయి. దాంతో ఆయన స్థానంలో హోస్ట్‌గా వ్యవహరించనున్నారని పలువురు హీరోయిన్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నాగార్జున స్థానంలో టాప్ అండ్ యంగ్ హీరోయిన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాగ్ స్థానంలో హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరంటే..

    రమ్యకృష్ణ పేరు తెరపైకి

    రమ్యకృష్ణ పేరు తెరపైకి

    బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 3‌కు అక్కినేని నాగార్జున ఓ వారంపాటు దూరం కావడంతో అనూహ్యంగా రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమె తనదైన శైలిలో ఇంటి సభ్యులను వేదిక మీద నుంచి కంట్రోల్ చేస్తూ ఆకట్టుకొన్నారు. రెండు రోజులపాటు వేదికపై గర్జిస్తూ ఆహ్లాదకరంగా షోను నడిపించారు. అయితే నాగభైరవ సీరియల్ కారణంగా ఈ ఆఫర్‌ను వదిలేసుకొన్నట్టు సమాచారం.

    జబర్దస్త్ రోజా పేరు వార్తల్లోకి

    జబర్దస్త్ రోజా పేరు వార్తల్లోకి

    ఇక రమ్యకృష్ణ పేరు తర్వాత సీనియర్ హీరోయిన్ రోజా పేరు మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఇప్పటికే టెలివిజన్‌ రంగంలో పలు మార్లు హోస్ట్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అయితే బిగ్‌బాస్ హెస్ట్‌గా రోజా పేరు పరిశీలనలోకి రాలేదనే విషయం సినీ వర్గాలు వెల్లడించాయి.

    అక్టోబర్ 24, 25 తేదీలలో నాగ్

    అక్టోబర్ 24, 25 తేదీలలో నాగ్

    అయితే తాజా సమాచారం ప్రకారం వైల్డ్ డాగ్ సినిమా షూటింగు కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్తున్నారు. అక్టోబర్ 24, 25 తేదీలలో హోస్ట్‌గా అందుబాటులో ఉండరనేది బిగ్‌బాస్ వర్గాల సమాచారం. ఇక ఆయన స్థానంలో తన కోడలు సమంత బాధ్యతలను స్వీకరించనున్నట్టు ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Bigg Boss షో నుంచి తప్పుకుంటున్న Nagarjuna..హోస్ట్ గా నేచురల్ స్టార్ Nani
    దసరా పండుగ నేపథ్యంలో సమంత అక్కినేని హోస్ట్‌గా

    దసరా పండుగ నేపథ్యంలో సమంత అక్కినేని హోస్ట్‌గా

    ఇక దసరా పండుగను పురస్కరించుకొని రాబోయే వారాంతపు షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించడానికి అంగీకరించారు అని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే సమంత నుంచి గానీ, బిగ్‌బాస్ నిర్వాహకులు ఎండెమాల్ షైన్ ఇండియా వర్గాలు కూడా ధృవీకరించకపోవడంతో తాజా వార్తపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    English summary
    Star actresss Samantha Akkineni to host Bigg Boss Telugu 4. Nagarjuna is going for the shoot of Wild dog. Reports suggest that Samantha will host the show for October 24, 25 in the eve of Dussehra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X