పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నది. పవన్ నటించే రెండు చిత్రాలకు సంబంధించిన స్క్రిప్టు పనులు చకచకా జరిగిపోతున్నాయనేది తాజా సమాచారం. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగడమే కాకుండా నటీనటుల ఎంపిక కూడా జోరుగా సాగుతున్నది. పవన్ కల్యాణ్ నటించే పింక్ రీమేక్‌లో సమంత అక్కినేని నటిస్తుందనే వార్తలు ఫిలింనగర్‌లో గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళితే..

అత్తారింటికి దారేది తర్వాత

అత్తారింటికి దారేది తర్వాత

గతంలో సమంత, పవన్ కల్యాణ్ కలిసి అత్తారింటికి దారేది చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కమర్షియల్‌గా ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి మొగ్గు చూపడంతో వారిద్దరి కాంబినేషన్ కుదరలేకపోయింది.

పింక్ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్

పింక్ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్

ఇక తాజాగా పవన్ పింక్ రీమేక్‌‌లో నటించడానికి ఓకే చెప్పడంతో దిల్ రాజు, బోనికపూర్ రంగంలోకి దిగారు. దర్శకుడిగా ఎంసీఏ ఫేమ్ శ్రీరాం వేణు కన్ఫర్మ్ అయ్యారు. కాగా సమంతను కీలకపాత్రలో నటింపచేయాలని దిల్ రాజ్ నిర్ణయం తీసుకోగా.. అందుకు ఆమె కూడా ఒకే చెప్పినట్టు వార్తలు గుప్పు మంటున్నాయి.

 హిందీ యూటర్న్‌కు నో

హిందీ యూటర్న్‌కు నో

ఇదిలా ఉండగా, ఇటీవల బాలీవుడ్ చిత్రానికి సమంత నో చెప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. యూటర్న్ హిందీ వెర్షన్‌లో నటించాలనే ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ప్రస్తుతం తాను దక్షిణాది సినిమాలతో హ్యాపీగా ఉన్నానని, ఉత్తరాదికి వెళ్లే ఆలోచన లేదని ఆమె తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
సమంత సినిమాలు ఇవే..

సమంత సినిమాలు ఇవే..

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. తమిళంలో విజయవంతమైన 96 చిత్ర రీమేక్ జాను చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నారు. అలాగే పింక్ సినిమాలో కూడా నటించేందుకు సిద్ధపడినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X