సమంత రియాలిటీ షో.. అల్లు అరవింద్ భారీ ఆఫర్.. అక్కినేని కోడలు సై!

స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత.. సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ట్రెండ్‌కి తగ్గట్టుగా ముందుకు సాగుతోంది. వరుస సినిమాలకు కమిట్ అవుతూనే టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆన్‌లైన్ వేదికపై ఓ రియాలిటీ షోకి హోస్ట్‌గా రానుందనే వార్తలు ఇటీవలి కాలంలో హల్చల్ చేశాయి. అయితే ఆ రియాలిటీ షోని సమంత ఒప్పుకోవడానికి కారణం బడా నిర్మాత అల్లు అరవింద్ అనేది తాజా సమాచారం. వివరాల్లోకి పోతే..

భర్తతో మజిలీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పైకి ఎంటర్

భర్తతో మజిలీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పైకి ఎంటర్

పెళ్లి తర్వాత తన భర్త నాగచైతన్యతో తెర పంచుకున్న సమంత 'మజిలీ' రూపంలో మరపురాని హిట్ అందుకుంది. ఆ తర్వాత ఓ బేబీ, జాను లాంటి సినిమాలతో అలరించడమే గాక ఇటీవలే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా అడుగుపెట్టింది. 'ది ఫ్యామిలీ మాన్ 2' లో నెగిటివ్ ఛాయలున్న పాత్రలో నటిస్తోంది సమంత.

 అరచేతిలో సమంత.. అలా డిసైడ్ అయిన బ్యూటీ

అరచేతిలో సమంత.. అలా డిసైడ్ అయిన బ్యూటీ

అలా అలా ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి వెండితెర క్వీన్ అనిపించుకున్న సమంత.. ఇకపై ప్రతీ ఇంటా, ప్రతీ ఒక్కరి అరచేతిలో ఆటలాడుతూ మెప్పించడానికి రెడీ అయిందట. తన సందడి రెట్టింపు చేస్తూ న్యూ స్టెప్ వేయాలని డిసైడ్ అయిన ఆమె రియాలిటీ షోకి హోస్ట్ బాధ్యతలు తీసుకుందని తెలుస్తోంది.

టెక్నాలజీ వేగం.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జోరు

టెక్నాలజీ వేగం.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జోరు

టెక్నాలజీ బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో సినిమాలకు స‌మాంత‌రంగా డిజిట‌ల్ కంటెంట్‌పై క్రేజ్ పెరుగుతూ వస్తోంది. నిత్యం బిజీగా వుండే సామాన్యుడు ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలోకి వ‌చ్చాక అన్నీ అందులోనే చూసుకోవ‌డం నిజ జీవితంలో చూస్తూనే ఉన్నాం. అందుకే కొత్త కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుట్టుకొస్తున్నాయి.

అల్లు అర‌వింద్ ప్లాన్.. హోస్ట్ సమంత

అల్లు అర‌వింద్ ప్లాన్.. హోస్ట్ సమంత

ఈ బాటలోనే బడా నిర్మాత అల్లు అర‌వింద్ సొంతంగా `ఆహా` పేరుతో డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ని ఇటీవ‌ల ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీనికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నారు. ఈ మేరకు ఓ రియాలిటీ షోని ప్లాన్ చేసిన అల్లు అర‌వింద్.. దానికి హోస్ట్‌గా చేసేందుకు గాను సమంతను ఒప్పించారట.

స్కెచ్ రెడీ.. సమంత స్పీడ్

స్కెచ్ రెడీ.. సమంత స్పీడ్

ఈ మేరకు స‌మంత‌కు భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్‌ ఆఫ‌ర్ చేసిన‌ట్టు టాక్. దీంతో అక్కినేని కోడలు కూడా వెంటనే సై అనేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఆన్‌లైన్ వేదికపై సత్తా చాటాలని సమంత తన స్కెచ్ రెడీ చేసుకొని ఇలా అడుగులేస్తోందట.

Recommended Video

Samantha Latest Pic Goes Viral || ఇన్స్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ పిక్ || Filmibeat Telugu
స్నేహ భర్తతో సామ్ రొమాన్స్..

స్నేహ భర్తతో సామ్ రొమాన్స్..

ఇకపోతే ఇటీవలే జాను ద్వారా కాస్త నిరాశ చెందిన సమంత.. తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్నఓ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందని సమాచారం. ఇది గాక మరో తమిళ ప్రాజెక్ట్‌ని ఒప్పుకున్న సామ్, అందులో స్నేహ భర్త నటుడు ప్రసన్న సరసన నటించనుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X