చెన్నైలో సైలెంట్‌గా కానిచ్చేస్తున్న సమంత.. బయటకొచ్చిన ఆసక్తికర వార్త

సమంత అక్కినేని.. హీరోయిన్లల్లోకెల్లా ఈ భామ ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ హీరోయిన్ అయినా పెళ్లయ్యాక సినిమాలు తగ్గించడం చూశాం.. కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా వెళ్తోంది. నాగ చైతన్యను వివాహం చేసుకున్నాక అక్కినేని వారింట అడుగుపెట్టిన ఈమె అక్కినేని సినీ వారసురాలిగా జోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సమంతకు సంబందించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆ వార్త ఏంటి? సమంత ఏం చేస్తోంది? వివరాల్లోకి పోతే..

మజిలీ, ఓ బేబీ రూపంలో వరుస హిట్స్

మజిలీ, ఓ బేబీ రూపంలో వరుస హిట్స్

గతేడాది వరుస విజయాలతో దూసుకుపోయిన సామ్.. ఈ ఏడాది కూడా అదే రేంజ్ కొనసాగిస్తోంది. ఇటీవలే భర్తతో కలిసి మజిలీ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈమె ఆ వెంటనే ఓ బేబీ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తాను మెప్పించగలను అని నిరూపించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సమంత కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ

టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ

ఇకపోతే సమంత టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ ఎప్పుడూ ముందే ఉంటుందనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్ గా ఉండే ఈమె ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కమిట్ అయ్యిందట. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగటం కారణంగా సమంత ఇటువైపుగా ఆలోచనలు చేస్తోందట.

చెన్నైలో సైలెంట్‌గా కానిచ్చేస్తూ

చెన్నైలో సైలెంట్‌గా కానిచ్చేస్తూ

అయితే ఈ వెబ్ సిరీస్‌కి సంబదించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో కొన్ని సీన్స్ కూడా షూట్ చేస్తున్నారట. ఇందులో సమంత పాల్గొంటోందని తెలిసింది. ఈ వెబ్‌ సిరీస్ ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ వెబ్ సిరీస్ విషయమై సమంత నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైలెంట్‌గా చెన్నైలో కానిచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు జనం.

ఆయనతో కలిసి షికార్లు

ఆయనతో కలిసి షికార్లు

ఇకపోతే సమంత తన కుటుంబం కోసం కూడా ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తుంటుంది. షూటింగ్‌కి ఏ మాత్రం గ్యాప్ దొరికినా భర్త నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో చెక్కర్లు కొడుతుంటుంది. పైగా అక్కడి విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది సమంత. ఏదేమైనా సామ్ రూటే సపరేటు లెండి!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X