సూపర్ ఫామ్‌లో సమంత.. ఇకపై అలా కూడా కనిపిస్తుందట! ఇదో కొత్త అవతారం
అక్కినేని కోడలిగా సమంత మాంచి ఫామ్‌లో ఉంది. విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత పంథా మార్చేసిన ఈ ముద్దుగుమ్మ ''సూపర్ డీలక్స్, మజిలీ, ఓ బేబీ'' లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు సినిమాల్లో రాణిస్తూనే ఇతర రంగాలపై కూడా దృష్టిసారిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటోంది.
ఇప్పటికే డిజిటల్ రంగంలోకి దూకేసి వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది సామ్. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో సమంత సందడి చేయబోతోంది. ఈ వెబ్ సిరీస్‌ని రాజ్ ఎన్ డీకే రూపొందిస్తున్నారు. టెర్రరిజమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది.

ఇకపోతే రియాలిటీ షోల్లో స్టార్ హోస్టింగులకు భారీ ఆదరణ లభిస్తుండటం చూసిన సమంత.. ఆ వైపుగా కూడా అడుగులు వేస్తోందట. ఓ రియాలిటీ షోకు కూడా హోస్ట్‌గా ఆమె అంగీకారం తెలిపిందని టాక్ బయటకొచ్చింది. అయితే ఈ రియాలిటీ తెలుగు లోనా, లేక తమిళంలోనా అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా బుల్లితెరపై సమంత హంగామా చూడాలని ఆత్రుత పడుతున్నారు ఈ విషయం తెలిసిన జనం.
సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సామ్ నటిస్తున్న జాన్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తమిళంలో గ్రాండ్ సక్సెస్ అయిన 96 సినిమాకు రీమేక్ మూవీయే ఈ జాన్.


Click it and Unblock the Notifications











