Samantha Naga Chaitanya అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్... మళ్లీ కలువబోతున్న సమంత, నాగచైతన్య
హీరోహీరోయిన్ నాగచైతన్య - సమంత ఎప్పుడో విడిపోయినప్పటికీ ఇప్పటికీ వీరి పేర్లు ఎప్పుడూ నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇద్దరు రహస్యంగా కలిశారనో, లేదా వేరొకరితో రిలేషన్షిప్ ఉన్నారంటూ, మరొకరితో పెళ్లి అంటూ ఇద్దరి గురించి ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటూనే ఉంటుంది. తాజాగా మరోసారి వీరిద్దరు మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. ఎందుకంటే సామ్-చైతూ మళ్లీ ఒక్కటవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించే ఈ కథనం.
హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోతున్నామని ప్రకటించి అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. 2022లో లీగల్‍గానూ వీరి బంధం పూర్తిగా ముగిసిపోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సింగిల్‍గానే ఉంటూ ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా ఉంటున్నారు. కానీ ఈ ఇద్దరి అభిమానులు మాత్రం చైతూ - సామ్ కలవాలని ఇప్పటికీ ఆశిస్తూనే ఉన్నారు.

అయితే నాగ చైతన్య ఆ మధ్యలో మరో హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ పలు సార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత దాని గురించి వినపడలేదు. ఇక సమంత అయితే రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ రెండు మూడు సార్లు వార్తలు వచ్చి హాట్‌టాపిక్‌గా మారాయి. కానీ అందులోనూ నిజం లేకుండా పోయింది. అయితే వీరిద్దరూ మాత్రం తమ పెంపుడు కుక్కను మాత్రం ఇప్పటికీ షేర్ చేసుకుంటూనే ఉంటారు. దాని ఆలనా పాలనా కొంత కాలం చైతూ చూసుకుంటే మరి కొంతకాలం సామ్ చూసుకుంటుంది.
ఇక సినిమాల విషయానికొస్తే సమంత కెరీర్ పర్వాలేదనిపించేలా సాగుతోంది. చివరిగా ఖుషి చిత్రంతో పలకరించింది. త్వరలోనే ఇండియన్ వెర్షన్ సిటాడెల్ వెబ్‌సిరీస్‌తో అలరించనుంది. ఈ మధ్యే లైఫ్‌లో రిఫ్రెష్మెంట్ కోసం, అలాగే ఆరోగ్యంపై పూర్తిస్థాయి శ్రద్ధ పెట్టేందుకు కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మళ్లీ ఇప్పుడిప్పుడే ప్రొఫెషనల్ లైఫ్‌లోకి అడుగుపెడుతోంది. రీసెంట్గా సిటాడెల్ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేసింది.
నాగ చైతన్య విషయానికొస్తే వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ప్రస్తుతం తండేల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆ మధ్య దూత వెబ్‌సిరీస్‌తో విజయాన్ని అందుకున్నారు చైతూ. ఈ సిరీస్‌కు సీక్వెల్ కూడా వస్తుందని డైరెక్టర్ క్రిష్ అన్నారు. ఇప్పుడీ సిరీస్ సీక్వెల్ కోసమే సమంత - చైతూ ఒక్కటవ్వనున్నట్లు తాజాగా బయట కథనాలు వస్తున్నాయి. సీక్వెల్లో సమంత నటించనుందని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని సంతోషిస్తున్నారు. ఇది నిజంగా జరిగితే బాగుండు అని తెగ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











