నాగార్జునకు డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో సమంత మూవీ.. మరో డిఫరెంట్ ప్రాజెక్ట్!
టాలెంటెడ్ హీరోయిన్ సమంత యశోద సినిమాతో నటిగా మరోసారి మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ కూడా అందుకుంది. అప్పటికే సినిమాకు నాన్ థియేట్రికల్ గా ప్రాఫిట్ లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక సమంత ప్రస్తుతం ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాలో కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. మంచి కంటెంట్ ఉన్న కథలో దొరికితే ఆమె చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ఇక త్వరలోనే ఆమె నుంచి మరొక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. చివరగా నాగార్జునకు డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆదర్శకుడు మరెవరో కాదు. చి ల సౌ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నటుడు రాహుల్ రవిచంద్రన్. ఆ మధ్య నాగ్ తో మన్మథుడు 2 అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. అంతకుముందే అతను నటుడిగా చాలా సినిమాలకు వర్క్ చేశాడు.

అలాగే రాహుల్, సమంతకు ఎక్కువ స్థాయిలో డబ్బింగ్ చెప్పిన చిన్మయి భర్త అని అందరికీ తెలిసిన విషయమే. ఒక విధంగా వీళ్ళు మంచి ఫ్రెండ్స్. ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక రాహుల్ రవిచంద్రన్ ఇదివరకే శర్వానంద్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు సమంతకు మళ్ళీ అతను ఒక కథ చెప్పినట్లు సమాచారం.
కథ నచ్చడంతో సమంత ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించబోయే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అయితే సమంత ఖుషి తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్టులో నటిస్తున్న విషయం తెలిసింది. అలాగే ఒక వెబ్ సిరీస్ చేయడానికి కూడా చర్చల్లోకి వచ్చినట్లు టాక్. ఇదివరకే ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 ద్వారా మంచి గుర్తింపు అందుకున్న సమంత ఈసారి మరొక డిఫరెంట్ వెబ్ సిరీస్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా యశోద తరహాలోనే మరొక ప్రయోగాత్మకమైన సినిమా చేయాలని రాహుల్ రవీంద్రన్ చర్చించినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











