హాట్ న్యూస్: నిర్మొహమాటంగా చెప్పమంటూ నిర్మాతతో సామ్.. ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే అంటూ

బడా నిర్మాత సురేష్ బాబుకు సమంత వరుస పెట్టి మెసేజీలు పెడుతోందట. భర్త నాగచైతన్య ద్వారా సురేష్ బాబు సమంతకు దగ్గరి బంధువే అవుతాడు. ఈ నేపథ్యంలో సమంత ఆయనకు మెసేజీలు ఎందుకు పెడుతున్నట్లు? ఇంతకీ ఆ మెసేజీల్లో సారంశమేంటి? సురేష్ బాబు వీటిపై రియాక్ట్ అవుతున్నారా? ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్ సర్కిల్ లో హాట్ హాట్ చర్చలకు దారితీస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం..

సమంత ఓ బేబీ సినిమా

సమంత ఓ బేబీ సినిమా

ఇటీవలే మజిలీ సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్న సమంత.. మరికొద్ది రోజుల్లో విలక్షణ కథాంశం ఓ బేబీ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను నిర్మించిన నిర్మాతల్లో ఒకరుగా ఉన్నారు దగ్గుబాటి సురేష్ బాబు. బడా నిర్మాతగా పేరుగాంచిన ఈయన తన దగ్గరి బంధువైన సమంత సినిమాను రూపొందించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఈ లోగా టీజర్ రిలీజ్.. ఆ వెంటనే సురేష్ బాబు నిరాశ

ఈ లోగా టీజర్ రిలీజ్.. ఆ వెంటనే సురేష్ బాబు నిరాశ

వచ్చే నెల విడుదల కానున్న ఓ బేబీ టీజర్ రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన లభించింది. ఇందులో చూపించిన కొన్ని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. కానీ ఇది నిర్మాత సురేష్ బాబుకు అంతగా నచ్చలేదట. ఫైనల్ కాపీ మీద ఆయన ఏమంత హ్యాపీగా లేరన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

అలాంటిదేమైనా ఉంటే చెప్పమంటూ సామ్..

అలాంటిదేమైనా ఉంటే చెప్పమంటూ సామ్..

ఈ నేపథ్యంలో సినిమాపై, టీజర్ పై ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పాలంటూ సమంత.. సురేష్ బాబుకు తెగ మెసేజీలు పెడుతోందని సమాచారం. అవసమైతే రీ షూట్ చేయడానికైనా రెడీ గానీ మీకు నిరాశ కలిగించిన అంశాలు చెప్పాలంటూ ఆయనపై ఒత్తిడి పెంచుతోందట సామ్. దీంతో రియాక్ట్ అయిన సురేష్ బాబు అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారట.

ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటూ

ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటూ

ఓ బేబీ ఫైనల్ కాపీ విషయంలో తనపై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని సురేష్ బాబు అన్నారట. ఈ మేరకు సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటూ స్పందిచారట. అయినా అనుమానం తీరని సమంత ఒకటికి రెండు సార్లు పదే పదే అడిగి మరీ క్లారిటీ తీసుకుంటోందట. కాగా ఓ బేబీ సురేష్ బాబుకు పూర్తిగా నచ్చలేదేమోనని సమంత పడిన టెన్షన్ అంతా ఇంతా కాదని ఆమె సన్నిహితులు చెబుతున్న మాట. ప్రస్తుతం ఈ టాపిక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ ఇష్యుగా మారింది.

తన టీమ్‌తో సురేష్ బాబు

తన టీమ్‌తో సురేష్ బాబు

సమంత బాగా టెన్షన్ పడుతుందని గమనించిన సురేష్ బాబు ఇలాంటి వార్తలు ఎక్కడ పుడుతున్నాయి? అసలేం జరుగుతోంది? అనే దానిపై ఆరా తీయాలని తన టీమ్ తో చెప్పాడనేది లేటెస్ట్ అప్‌డేట్. మొత్తానికైతే ఈ ఉదంతాన్ని బట్టి ఓ బేబీ సినిమాపై సమంత
ఎన్ని ఆశలు పెట్టుకుందో అర్థమవుతోంది కదూ!

ఓ బేబీ మూవీ

ఓ బేబీ మూవీ

కొరియన్‌ చిత్రం 'మిస్ గ్రానీ'కి తెలుగు రీమేక్‌గా రాబోతున్న సినిమానే ఓ బేబీ. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత మునుపెన్నడూ చేయని డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ.. 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల రానుంది. చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. లక్ష్మీ, నాగ శౌర్య, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. జులై నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X